సినిమా హీరోలు జస్ట్ మిస్, ఫారెస్టు అధికారులు ఇంటికి, ఫోటోలు తెచ్చిన తంటాతో ఉద్యోగాలు ఊస్ట్ !
బెంగళూరు: మీడియాలో పులిగోళ్య వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. పులి గోళ్లను ధరించిన అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశాలు జారీ చేశారు. అటవీశాఖకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అంటూ కన్నడ మీడియా దుమ్మెత్తిపోసింది. మీడియాలో వరుస కథనాలు రావడంతో అటవి శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు.
అంతేకాకుండా ఇద్దరు ఫారెస్ట్ అధికారుల పూర్తి సమాచారం పిన్ టూ పిన్ తెలుసుకున్న మంత్రి ఈశ్వర్ ఖండ్రే పులి గోళ్లు ధరించిన అటవీ అధికారులను సస్పెండ్ చేశామని మీడియాకు చెప్పారు. కన్నడ బిగ్ బాస్ షో కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ అరెస్టు తర్వాత అటవీశాఖ అధికారులపై పలు అనుమానాలు వచ్చాయి.

పులి గోళ్లను ధరించినందుకు డీఆర్‌ఎఫ్‌వో దర్శన్‌పై ఫిర్యాదు చేశారు. చిక్కబళ్లాపూర్ ఆర్‌ఎఫ్‌ఓ మునిరాజ్ కూడా పులి పంజా లాకెట్లు ధరించారని అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. పీసీసీఎఫ్ పుష్కర్‌కుమార్‌ను పిలిపించి విచారణ చెయ్యాలని మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు.
డీఆర్‌ఎఫ్‌వో దర్శన్ విచారణకు హాజరు కాకపోవడంపై అధికారులు మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి సమాచారం అందించారు.

విచారణకు హాజరుకాని దర్శన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఈశ్వర్ ఖండ్రే ఫోన్‌లో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పు చేసిన అటవీ అధికారులపై కూడా ఈశ్వర్ ఖండ్రే చర్యలు తీసుకున్నారు. అయితే ఇదే కేసులో ఫారెస్టు అధికారి దర్శన్ అరెస్టు కావడం కలకలం రేపింది. పులి గోళ్ల కేసులో హిందువులను టార్గెట్ చేశారంటూ బీజేపీ సీనియర్ నాయకుడు అరవింద్ బెల్లాడ్ చేసిన ఆరోపణపై స్పందించిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే బీజేపీ నాయకుడుఅరవింద్ బెల్లాడ్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.

అరవింద్ బెల్లాడ్ తెలివైన రాజకీయ నాయకుడు అని తనకు తెలుసు, ఈ విషయంలోనూ రాజకీయం చెయ్యడం ఎంత వరకు న్యాయం అని మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రశ్నించారు. దీని గురించి ఎవరూ ఆలోచించలేరు. కుల మతాల పోరాటాల విధానాన్ని అనుసరిస్తూ రాష్ట్రమంతా విభజన వాతావరణాన్ని సృష్టించింది. ఇలాంటి ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దీన్ని ఖండిస్తున్నానని, ఇందులో ఏ కులం, మతం ప్రమేయం లేదని, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందని మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు.












Click it and Unblock the Notifications