మతిపోయిందిపో, యడియూరప్ప బంధువు, అప్ప పీఏకి నో సీట్, మరో పార్టీలోకి జంప్ !
బెంగళూరు/శివమొగ్గ: రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. మాజీ సీఎం సమీప బంధువు, సీఎంకు పీఏగా పని చేసిన వ్యక్తి ఇప్పుడు పార్టీ మారడానికి ప్రయత్నించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకాలం ఎమ్మెల్యే సీటు వస్తుందని అనుకున్న మాజీ సీఎం పీఏ ఇప్పుడు వేరే పార్టీని ఆశ్రయించడానికి ప్రయత్నాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఎవరిని అయితే సీఎం పదవి నుంచి కిందకు దించడానికి పావులు కదిపాడో అదే వ్యక్తి ఇప్పుడు అదే సీఎం దగ్గరకు వెళ్లి సార్ మీ పార్టీ సీటు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఎదురుకావడం విశేషం. మూడు ఏళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉండటం, జేడీఎస్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి సీఎంగా ఉన్న విషయం తెలిసిందే.

ఆపరేషన్ కమల పేరుతో బీఎస్ యడియూరప్ప కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మందిని తన వైపు తిప్పుకోవడంతో హెచ్ డీ. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. తరువాత యడియూరప్ప సీఎం అయ్యారు. యడియూరప్పకు సమీప బంధువు. అప్పకు పీఏగా వ్యవహరించిన ఎన్ఆర్. సంతోష్ అప్పట్లో రెబల్ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడంలో కీలకపాత్ర పోషించాడు.
తరువాత యడియూరప్ప సీఎంగా ఉన్నంతకాలం సంతోష్ ప్రభుత్వంలో చక్రం తిప్పాడు. అదే సమయంలో హాసన్ జిల్లాలోని అరసికెరెలో బీజేపీ టిక్కెట్ తనకే వస్తుందని సుమారు రెండేళ్ల నుంచి సంతోష్ స్థానిక ఓటర్లతో టచ్ లో ఉంటూ డబ్బులు కూడా భారీ మొత్తంలోనే ఖర్చు చేశారు. అయితే అరసికెరె బీజేపీ టిక్కెట్ ఇప్పుడు శివలింగేగౌడకు ఇచ్చారు.

ఇంతకాలం తానే బీజేపీ అభ్యర్థి అని ప్రచారం చేసుకుని విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన సంతోష్ టిక్కెట్ రాకపోవడంతో రగిలిపోతున్నారు. ఇంతకాలం తాను పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని సంతోష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరసికెరెలో జేడీఎస్ టిక్కెట్ మీద పోటీ చెయ్యాలని అనుకున్న సంతోష్ ఇప్పటికే మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ మంత్రి రేవణ్ణతో మాట్లాడారని కన్నడ మీడియా అంటోంది.
అయితే తనను సీఎం పదవి నుంచి కిందకు దింపడానికి ప్రత్యక్షంగా ప్రయత్నించిన సంతోష్ కు జేడీఎస్ టిక్కెట్ ఇవ్వనని కుమారస్వామి ఆయన సన్నిహితుల దగ్గర చెప్పారని తెలిసింది. లింగాయత్ వర్గం ఓట్లు అధికంగా ఉన్న అరసికెరెలో అదే లింగాయత్ వర్గానికి చెందిన సంతోష్ కు జేడీఎస్ టిక్కెట్ ఇస్తే మంచిది అని స్దానిక జేడీఎస్ నాయకులు అంటున్నారని తెలిసింది. అయితే బాల్ కుమారస్వామి దగ్గర ఉండటంతో సంతోష్ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని జేడీఎస్ లీడర్లు అంటున్నారు.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications