అయ్యో సిద్దూ, విశ్రాంతి లేకుండా ఈ వయసులో సుడిగాలిలా తిరిగితే ఎలా ? పవర్ !
బెంగళూరు/విజయనగర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు బిజీ అయ్యారు. విశ్రాంతి లేకుండా కర్ణాటక రాష్ట్రంలోని నలుమూలలు తిరుగుతున్న మాజీ సీఎం సిద్దరామయ్య హెలిప్యాడ్ లో అందరిని పలకరించారు. కారు ఎక్కి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభివాదం చేస్తున్న సమయంలో సిద్దరామయ్య ఒక్కసారిగా పక్కకు పడిపోయారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పలు నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్దరామయ్య కర్ణాటకలోని పలు నియోజ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలని మనవి చేస్తున్నారు.

కర్ణాటకలోని వివిద జిల్లాల్లో పర్యటించడానికి సిద్దరామయ్యకు ప్రత్యేకమైన హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు సుమారు 150 హెలికాప్టర్లు అద్దెకు తీసుకున్నారు. కర్ణాటకలోని పలు నియోజక వర్గాలకు వెలుతున్న సిద్దరామయ్య ఎన్నికల ప్రచారం చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు.
శనివారం ప్రత్యేక హెలికాప్టర్ లో సిద్దరామయ్య విజయనగరకు వెళ్లారు. అక్కడి నుంచి కూడ్లగిలోని హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లిన సిద్దరామయ్య అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పేరుపేరునా పలకరించారు. తరువాత హెలిప్యాడ్ సమీపంలో సిద్దంగా ఉన్న కారు దగ్గరకు వెళ్లిన సిద్దరామయ్య కారు ఎక్కారు.

కారు ముందు సీటులో నిలబడిన సిద్దరామయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తూ అందరికి అభివాదం చేశారు. తరువాత కారులో కుర్చోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సిద్దరామయ్య ఒక్కసారిగా పక్కకువాలిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదపడ్డారు. ఆ సందర్బంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు వారి వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు.
ఈ సంఘటనతో సిద్దరామయ్య అభిమానులు షాక్ అయ్యారు. తనకు ఏమీ కాలేదని, విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వలన కొంచెం కళ్లు తిరిగిపడిపోయానని సిద్దరామయ్య సోషల్ మీడియాలో పోస్టు చేసి తాను బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. సిద్దరామయ్య ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications