ఐశ్వర్యకు రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది ?, ఈడీకి అనుమానం, అరెస్టు చేస్తారా, అయితే ?!

న్యూఢిల్లీ/బెంగళూరు: అక్రమ నగదు లావాదేవీలు చేశారని అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లారు. ఐశ్వర్య పేరుతో రూ. 100 కోట్లకు పైగా ఆస్తి ఉండటంతో అనుమానంతో ఈడీ అధికారులు ఆమెకు సమన్లు ఇచ్చారు.

అక్రమ నగదు లావాదేవీలు

అక్రమ నగదు లావాదేవీలు

అక్రమంగా నగదు లావాదేవీలు చేశారని ఆరోపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నాలుగు రోజులు మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను విచారణ చేసి చివరికి అరెస్టు చేశారు. డీకే. శివకుమార్ ను విచారణ చేస్తున్న అధికారులు ఇప్పుడు ఆయన కుమార్తె ఐశ్వర్యకు సమన్లు జారీ చేశారు.

ఐశ్వర్య అరెస్టు అయితే ?

ఐశ్వర్య అరెస్టు అయితే ?

కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయన కుమార్తె ఐశ్వర్యకు సమన్లు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను అరెస్టు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఐశ్వర్యను అరెస్టు చేస్తారా ? లేదా ? అనే విషయం విచారణ తరువాత వెలుగు చూడనుంది.

ఢిల్లీకి ఐశ్వర్య

ఢిల్లీకి ఐశ్వర్య

కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య బుధవారం ఢిల్లీ వెళ్లారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేసిన ప్రకారం గురువారం ఐశ్వర్య ఈడీ అధికారుల ముందు హాజరుకావలసి ఉంది. ఒక్క రోజు ముందుగానే ఐశ్వర్య ఢిల్లీ వెళ్లారు.

ఐశ్వర్య ఆస్తి రూ. 100 కోట్లు

ఐశ్వర్య ఆస్తి రూ. 100 కోట్లు

కర్ణాటకలో గత శాసన సభ ఎన్నికల జరిగిన సమయంలో డీకే. శివకుమార్ ఆయన ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. తన కుమార్తె ఐశ్వర్య పేరు మీద రూ. 100 కోట్లకు పైగా ఆస్తి ఉందని డీకే. శివకుమార్ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు.

ఇంత చిన్న వయసులో ఎంత ఆస్తి ?

ఇంత చిన్న వయసులో ఎంత ఆస్తి ?

ఇంత చిన్న వయసులో డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు అంత ఆస్తి ఎలా వచ్చింది ? అని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో ఐశ్వర్యను విచారణ చేసి వివరాలు సేకరించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+