గాలి కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు: ఆయన వస్తారాంట ?

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లికి అతిరథ మహారథులు రానున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. గాలి కుమార్తె పెళ్లి ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి.

పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఆయన అనుచరులు దగ్గరుండి చకచకా చేయిస్తున్నారు. పెళ్లి శుభలేఖతో అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన గాలి జనార్దన్ రెడ్డి పెళ్లి ఘనంగా చేసి చరిత్ర సృష్టించాలని నిర్ణయించారని తెలిసింది.

షారుక్ ఖాన్ వస్తారా ?

షారుక్ ఖాన్ వస్తారా ?

గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, కత్రినా కైఫ్ తో సహ తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరుకానున్నారని టాక్.

బీజేపీలో కీలక పాత్ర

బీజేపీలో కీలక పాత్ర

అయితే వారు వస్తారో లేదో తెలీదు కాని అందరికి ఆహ్వాన పత్రికలు మాత్రం పంపిస్తున్నారు. ఇక బీజేపీలో ఓ వెలుగు వెలిగి కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకపాత్ర పోషించిన గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి ఆ నాయకుల వస్తారా ? అని అందరూ ఆలోచిస్తున్నారు.

మోడీకి వెడ్డింగ్ కార్డు

మోడీకి వెడ్డింగ్ కార్డు

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీని తన ఇంట్లో జరిగే శుభకార్యానికి గాలి జనార్దన్ రెడ్డి ఆహ్వానించాలని నిశ్చయించారని సమాచారం. అయితే జైలు శిక్ష అనుభవించి ఆరోపణలు ఎదుర్కోంటున్న వ్యక్తి ఇంట్లో శుభకార్యానికి వెలితే ఆరోపణలు వస్తాయని కొందరు మోడీ చెవిలో వేశారని సమాచారం.

కాంగ్రెస్ చేతికి అస్త్రం

కాంగ్రెస్ చేతికి అస్త్రం

ప్రతిపక్షాలు సైతం ఈ విషయం అడ్డంపెట్టుకుని ఆరోపణలు చేసే అవకాశం ఉందని బీజేపీ అధిష్టాన నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాకపోయినా పలువురు కేంద్ర మంత్రులు గాలి ఇంట్లో జరిగే వివాహానికి హాజరౌతారని సమాచారం.

సుష్మా స్వరాజ్ కు ఆహ్వానం

సుష్మా స్వరాజ్ కు ఆహ్వానం

గాలి సోదరులు సొంత తల్లిగా భావించే కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ గతంలో వరమహాలక్ష్మి పండగ వచ్చిందంటే ఆమె బళ్లారికి వచ్చేవారు. సాంప్రదాయంగా వరమహాలక్ష్మి పండగ చేసుకుని పూజలు చేసి గాలి సోదరులను ఆశిర్వధించారు.

సామూహిక వివాహాలు

సామూహిక వివాహాలు

అదే రోజు సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా వందలాధి మందికి ఉచిత సామూహిక వివాహాలు జరిపించి ఆశిర్వధించేవారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి అక్రమ గనుల కేసులో జైలుకు వెళ్లిన తరువాత సుష్మా స్వారాజ్ బళ్లారికి ఒక్క సారికూడా రాలేదు.

శీతాకాల సమావేశాలు

శీతాకాల సమావేశాలు

ఇప్పుడు కూడా సుష్మా స్వరాజ్ గాలి ఇంట పెళ్లికి రావడం అనుమానమే అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. నంవబర్ లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయని, అందు వల్ల ఆమె పెళ్లికి రాలేరని సమాచారం.

ఇద్దరూ వస్తారంట !

ఇద్దరూ వస్తారంట !

బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యంత్రి, సినీ నిర్మాత హెచ్.డీ. కుమారస్వామి, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు వివాహానికి హాజరౌతారని సమాచారం.

ఆహ్వానిస్తున్నాం

ఆహ్వానిస్తున్నాం

అయితే తాము ప్రధాని నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్, కేంద్ర మంత్రులు తదితరులను పెళ్లికి ఆహ్వానిస్తున్నామని గాలి జనార్దన్ రెడ్డి అప్రధాన అనుచరుడు, బీజేపీ ఎంపీ బి. శ్రీరాములు అంటున్నారు. పెళ్లి శుభలేఖపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

అంతా మీడియానే చేస్తోంది

అంతా మీడియానే చేస్తోంది

గతంలో గాలి జనార్దన్ రెడ్డి కష్టాలు ఎదుర్కొన్నారని శ్రీరాములు చెప్పారు. ఇప్పుడు ఆయన తన కుమార్తె పెళ్లి ఘనంగా చేసి బంధువులు, స్నేహితులు, అభిమానులను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీరాములు స్పష్టం చేశారు.

టెక్నాలజీ ఉపయోగించుకున్నాం

టెక్నాలజీ ఉపయోగించుకున్నాం

సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి వెడ్డింగ్ కార్డు తయారు చేయడం తప్పు ఎలా అవుతుందని శ్రీరాములు ప్రశ్నించారు. మీడియా అనవసరంగా గాలి ఇంట జరుగుతున్న శుభకార్యం విషయంలో అత్యుత్సాహం చూపిస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+