Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామా వెనక్కి తీసుకున్నా, రెబల్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి, సీఎం మద్దతు, కాంగ్రెస్ ఒత్తిడి !

బెంగళూరు: నా రాజీనామా లేఖను మొన్ననే వెనక్కి తీసుకున్నానని కర్ణాటక మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. శుక్రవారం తాను అసెంబ్లీలో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి మద్దతుగా ఓటు వేస్తానని ఎమ్మెల్యే రామలింగా రెడ్డి అన్నారు. శుక్రవారం రామలింగా రెడ్డి విధాన సౌధలో మీడియాతో మాట్లాడారు.

రాజీనామా లేఖను వెనక్కి తీసుకోవాలని తన మీద ఎవ్వరూ ఒత్తిడి చెయ్యలేదని రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రెబల్ ఎమ్మెల్యేలు రహస్య ప్రాంతం నుంచి మాట్లాడిన వీడియో విడుదల చేశారు. తమతో పాటు రామలింగా రెడ్డి రాజీనామాలు వెనక్కి తీసుకోమని అన్నారు.

Karnataka former minister, MLA Ramalinga Reddy confirmed that he has taken back his resignation.

కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఎస్ టీ. సోమశేఖర్, మునిరత్న, భైరతి బసవరాజ్ మాట్లాడిన వీడియో విడుదల చేశారు. తామ మాజీ మంత్రి రామలింగా రెడ్డిని అనుసరించమని ఎమ్మెల్యే ఎస్ టీ. సోమశేఖర్ అన్నారు. ఇంతకు ముందే మేము నలుగురు (రామలింగా రెడ్డితో కలిపి) ఓ నిర్ణయం తీసుకుని రాజీనామాలు చేశామని రెబల్ ఎమ్మెల్యే ఎస్ టీ. సోమశేఖర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ నాయకుల ఒత్తిడికి లోనైన మాజీ మంత్రి రామలింగా రెడ్డి రాజీనామా లేఖను వెనక్కి తీసుకున్నారని రెబల్ ఎమ్మెల్యే ఎస్ టీ. సోమశేఖర్ ఆరోపించారు. తాము మాత్రం మా రాజీనామా లేఖలు వెనక్కి తీసుకోమని రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే రామలింగా రెడ్డి రాజీనామా వెనక్కి తీసుకోవడంతో ఇన్ని రోజులు ఆయన్ను అనుసరిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ముంబైలో ఏం చేస్తారు ? అని వేచిచూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+