బీజేపీలోకి కాంగ్రెస్ లీడర్ అనీల్ ?, గాలి రెడ్డి మీద పోటీ, ఆరోజు శత్రువు, ఏం ప్లాన్ !
బళ్లారి/బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. బళ్లారి జిల్లాలో మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో నువ్వానేనా అంటూ ఇంత కాలం పోటీపడిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ బీజేపీలో చేరడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే అనీల్ లాడ్ బీజేపీ నేతలతో చర్చలు జరిపి ఆపార్టీలో చేడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనీల్ లాడ్ సైతం శ్రీమంతుడే కావడం విశేషం.

కాంగ్రెస్ కు దూరం
2018 శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన అనీల్ లాడ్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు అనీల్ లాడ్ హాజరుకావడం లేదు. బళ్లారి జిల్లాలో అనీల్ లాడ్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. మైనింగ్ వ్యాపారంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొనే అనీల్ లాడ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

చక్రం తిప్పిన మంత్రి
మోళకాల్మూరు ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములుతో ఇప్పటికే అనీల్ లాడ్ చర్చలు జరిపారని సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనీల్ లాడ్ మాట్లాడుతూ ఇప్పటికే తాను బీజేపీ మంత్రి బళ్లారి శ్రీరాములుతో చర్చలు జరిపానని అన్నారు. త్వరలోనే తాను రాజకీయాలపై సరైన నిర్ణయం తీసుకుంటానని అనీల్ లాడ్ చెప్పారు.

వెన్నుపోటు కాదు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తన అనుచరులు, స్నేహితులు అందరితో చర్చించిన తరువాత తాను బీజేపీలో చేరే విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటానని అనీల్ లాడ్ చెప్పారు. పార్టీ మారే విషయంలో మీ అభిప్రాయాలు చెప్పాలని ఇప్పటికే తాను అందరికీ సమాచారం ఇచ్చానని, ప్రతి ఒక్కరికి చెప్పిన తరువాతే బీజేపీలో చేరుతానని కాంగ్రెస్ లీడర్ అనీల్ లాడ్ అన్నారు.

సిద్దరామయ్యకు తెలుసు
తాను బీజేపీలో చేరుతున్నానని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్యకు ఇప్పటికే చెప్పానని అనీల్ లాడ్ అన్నారు. అవసరం అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని భేటీ అయ్యి తాను పూర్తి వివరాలు చెప్పడానికి సిద్దంగా ఉన్నానని, ఎవ్వరికి వెన్నుపోటు పొడిచే ఉద్దేశం తనకు లేదని, కార్యకర్తల నిర్ణయం మేరకే పార్టీ మారుతున్నానని అనీల్ లాడ్ వివరించారు.

గాలి బ్రదర్స్ దెబ్బ
2018 శాసన సభ ఎన్నికల సమయంలో బళ్లారి నగరం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ మీద అనీల్ లాడ్ పోటీ చేశారు. బీజేపీ టిక్కెట్ మీద గాలి సోమశేఖర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారు. గాలి సోమశేఖర్ రెడ్డికి 76, 598 ఓట్లు, అనీల్ లాడ్ కు 60,434 ఓట్లు వచ్చాయి. గాలి సోమశేఖర్ రెడ్డి చేతిలోనే అనీల్ లాడ్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.

షరతులు లేవు !
బీజేపీలో చేరడానికి తాను ఎలాంటి షరతులు పెట్టలేదని కాంగ్రెస్ లీడర్ అనీల్ లాడ్ అంటున్నారు. సామాన్య కార్యకర్తగా తాను బీజేపీలో చేరుతానని, పార్టీ అప్పగించిన భాద్యతలు చూసుకుంటానని, ఎలాంటి షరతులతో తాను బీజేపీలో చేరాలని అనుకోలేదని అనీల్ లాడ్ అన్నారు. సోమవారం సీఎం యడియూరప్పతో భేటీ అయిన తరువాత అనీల్ లాడ్ అధికారికంగా బీజేపీలో చేరడానికి సిద్దం అయ్యారని సమాచారం.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications