కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కారుపై దాడి: నటి, మాజీ ఎంపీ రమ్య వార్ !

గుజరాత్ లోని వరద ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను ఓదార్చడానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారు మీద రాళ్లుతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాల

బెంగళూరు: గుజరాత్ లోని వరద ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను ఓదార్చడానికి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారు మీద రాళ్లుతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్యాండిల్ వుడ్ క్వీన్, ఆ పార్టీ మాజీ ఎంపీ రమ్య డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్ అయిన రమ్య అదే సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాహుల్ గాంధీ కాన్వాయ్ మీద బీజేపీ యువమోర్చ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని రమ్య ఆరోపించారు.

Karnataka former MP Ramyas twitter war for Rahul Gandhi

ఇంత జరిగినా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మాత్రం నోరు విప్పడం లేదని, తమ పార్టీ కార్యకర్తలను వెనుక వేసుకుని వస్తున్నారని రమ్య ఆరోపించారు. గతంలో వీలుచిక్కినప్పుడు సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకుల మీద రమ్య తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. శుక్రవారం గుజరాత్ లోని బనష్కంఠ ప్రాంతంలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తలు ఆయన కారుతో పాటు కాన్వాయ్ మీద రాళ్లతో దాడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+