సామాన్యులకు బిగ్ షాక్.. పాల ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సామాన్య ప్రజలకు బిగ్ షాక్. నిత్యావసర ధరలు నిత్యం పెరుగుతూ పేదవాడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా పాల ధరలు భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా నందిని పాల ధరలను పెంచుతూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి లీటర్ పై ఏకంగా రూ.4 రూపాయలు పెరగనున్నట్లు సమాచారం. ఏకంగా లీటర్ కు రూ.4 చొప్పున పెంచేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కె. వెంకటేశ్ వెల్లడించారు.

రాష్ట్రంలోని పాడి పరిశ్రమను ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ వ్యయం పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో పాల ధరలను పెంచినట్లు చెప్పుకొచ్చారు. లీటరుకు 4 రూపాయలు చొప్పున పెంచామని తెలిపారు. పెరిగిన పాల ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కర్ణాటకలో నందిని పాలు ప్రాథమిక రకం ధర లీటరుకు రూ.42 నుండి రూ.46కు.. పెరుగు ధరను లీటరుకు రూ.50 నుంచి రూ.54కు పెరగనుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను నందిని అనే బ్రాండ్ తో విక్రయిస్తుంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణలోనూ పాల ధరలను పెంచాలన్న యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రైతన్నలకు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్న రేవంత్ సర్కార్ త్వరలో పాల ధరలనూ పెంచి పాడి రైతులకు మేలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ డెయిరీ పాలను లీటరుకు రూ. 3 రూపాయల వరకు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు మాత్రం రాలేదు.












Click it and Unblock the Notifications