హైకోర్టు జడ్జీలకు బెదిరింపులు: చీఫ్ జస్టిస్‌కూ: వై కేటగిరీ సెక్యూరిటీ: సీఎం జోక్యం
బెంగళూరు: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన- హిజబ్. ముస్లింలు సంప్రదాయబద్ధంగా ధరించే హిజబ్‌ను ధరించి తరగతులకు హాజరు కావడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు దుమారాన్ని రేపాయి. ముస్లిం విద్యార్థినులు హిజబ్ వేసుకుని తరగతులకు హాజరు కావడాన్ని నిరసిస్తూ- హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరించడం వివాదాస్పదమైంది. కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త జింగాడె హర్ష హత్యకు దారి తీసింది.

సంచలన తీర్పు..
హిజబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఆదేశాలను పలు మైనారిటీ సంఘాలు హైకోర్టులో సవాల్ చేశాయి. అనేక పిటీషన్లను దాఖలు చేశాయి. వాటన్నింటినీ స్వీకరించిన హైకోర్టు సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా మొహియుద్దీన్ ఖాజీతో ఏర్పాటైన ముగ్గురు జడ్జీల ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారించింది.

సుప్రీంకోర్టులో ఛాలెంజ్..
కొద్ది రోజుల కిందటే దీనిపై సంచలన తీర్పు వెలువడించింది. హిజబ్‌కు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసిందీ ధర్మాసనం. హిజబ్ తప్పనిసరిగా ధరించాలనే నియమం ఏదీ కూడా ఇస్లాం లేదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తులు. దీనిపై చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగట్లేదు. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ముస్లిం సంఘాల ప్రతినిధులు.

ముస్లిం పర్సనల్ లా బోర్డు..
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కాకుండా స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇస్లాం సంప్రదాయానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఇలాంటి తీర్పులు సమర్థనీయం కాదని పేర్కొంది. మహిళలు ఏ రకమైన దుస్తులను ధరించాలో తామే నిర్ధారించినట్టయిందని వ్యాఖ్యానించింది. తమకు ఇష్టమైన దుస్తులను ధరించే స్వేచ్ఛను కూడా హరించినట్టయిందని అభిప్రాయపడింది.

న్యాయమూర్తులకు బెదిరింపులు..
హిజబ్ నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పును వెలువడించిన ముగ్గురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ రీతురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా మొహియుద్దీన్ ఖాజీకి బెదిరింపులు అందుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు వారికి ఫోన్లు చేసి- చంపేస్తామంటూ హెచ్చరిస్తోన్నారు. దీనిపై వారు బెంగళూరు విధానసౌధ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఆరంభించారు.

స్పందించిన సీఎం..
ముగ్గురు న్యాయమూర్తులకు బెదిరింపులు అందడం పట్ల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ముగ్గురు న్యాయమూర్తులకు వై సెక్యూరిటీతో కూడిన భద్రతను కల్పించనున్నట్లు చెప్పారు. ఈ దిశగా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ పోలీస్ డైరెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేశానని అన్నారు. విధానసౌధ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదుపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. రాజ్యాంగానికి అందరూ సమానమేనని, చట్టానికీ ఎవరూ అతీతులు కారని బొమ్మై వ్యాఖ్యానించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications