లైవ్-హైదరాబాద్‌కు కర్ణాటక డ్రామా: బీజేపీకి షాక్, రేపు సాయంత్రం 4.గం.లకు ఫ్లోర్ టెస్ట్

బెంగళూరు: కర్ణాటకలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కర్ణాటక ప్రభావం గోవా, బీహార్, మణిపూర్ రాష్ట్రాల పైనా పడుతోంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ హార్స్ ట్రేడింగ్ చేస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. అయితే గతంలో కాంగ్రెస్ కూడా చీల్చి పాలించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ - దేవేగౌడలు 1996లో గుజరాత్‌లో బీజేపీని చీల్చి గద్దెనెక్కడం మొదలు.. కర్ణాటకలో ఎన్నికల్లో గెలుపొందడం కోసం లింగాయత్‌లకు ప్రత్యేక మతం అంశాన్ని గుర్తు చేస్తున్నారు.

Recommended Video

    కర్ణాటక బల పరీక్ష...యడ్యూరప్ప నేగ్గేనా???

    మరోవైపు, అమిత్ షా హార్స్ ట్రేడింగ్‌లో దిట్ట అని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇంకోవైపు, అసలు జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీల పొత్తుతో చాలామంది లింగాయత్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు బీజేపీకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. కుమారస్వామిని సీఎంగా చేయడం జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరో ఆలోచనతో ఉండటం బీజేపీకి కలిసి వస్తోందని, అదే ధైర్యంతో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారని అంటున్నారు. కర్ణాటక పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి.

    Karnataka Govt formation Live: Developments trigger series of reactions in Goa, Bihar and Manipur

    May 18, 2018, 2:14 pm IST

    బీహార్ గవర్నర్‌కు మెమోరాండం సమర్పిస్తున్న దృశ్యం.
    May 18, 2018, 2:14 pm IST

    ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మేం బెంగళూరుకు బయలుదేరతామని జెడీఎస్ నేత జీటీ దేవేగౌడ చెప్పారు. ఎమ్మెల్యేలు హైదరాబాదులోని హోటల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే.
    May 18, 2018, 2:13 pm IST

    రూ.100 కోట్లు ఇచ్చినా, రూ.200 కోట్లు ఇచ్చినా ఎమ్మెల్యేలు అంతా తమ వెంటేనని జేడీఎస్ నేత దేవేగౌడ అన్నారు.
    May 18, 2018, 2:12 pm IST

    బీహార్‌లో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ సత్యపాల్ సింగ్‌కు మెమోరాండం అందించారు.
    May 18, 2018, 2:11 pm IST

    మణిపూర్ గవర్నర్‌ను కలిశామని, కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పాని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఆయన చెప్పారని ఇబోబీ సింగ్ తెలిపారు.
    May 18, 2018, 2:11 pm IST

    కర్ణాటక అంశంపై రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు వేచి చూద్దామని మణిపూర్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఓక్రమ్ ఇబోబీ సింగ్ అన్నారు.
    May 18, 2018, 2:09 pm IST

    కర్ణాటక ప్రభావంతో గోవా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ మేరకు మెమోరాండం సమర్పించారు.
    May 18, 2018, 1:02 pm IST

    సుప్రీం ఆదేశాల మేరకు మేం బలం నిరూపించుకుంటామని, రేపు 11 గంటలకు అసెంబ్లీ సమావేశాల కోసం గవర్నర్‌కు ఫైల్ పంపిస్తామని యడ్యూరప్ప చెప్పారు.
    May 18, 2018, 1:00 pm IST

    సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని గులాం నబీ ఆజాద్ అన్నారు.
    May 18, 2018, 12:31 pm IST

    బీజేపీ ఎంపీ శోభ కందర్లాజే మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
    May 18, 2018, 12:25 pm IST

    సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, తమకు బలం ఉందని యడ్యూరప్ప ప్రకటించారు.
    May 18, 2018, 11:57 am IST

    ఫ్లోర్ టెస్టు పూర్తయ్యే వరకు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
    May 18, 2018, 11:57 am IST

    ఫ్లోర్ టెస్టు పూర్తయ్యే వరకు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
    May 18, 2018, 11:56 am IST

    రహస్య బ్యాలెట్ ద్వారా ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని బీజేపీ కోరగా, సుప్రీం కోర్టు నిరాకరించింది.
    May 18, 2018, 11:55 am IST

    ప్రొటెం స్పీకర్ రేసులో ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ దేశ్ పాండేను కోరుకుంటే, బీజేపీ ఉమేష్ కట్టిని కోరుకుంటోంది. గవర్నర్ నిర్ణయిస్తారు.
    May 18, 2018, 11:54 am IST

    ఫ్లోర్ టెస్టు నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ భద్రత ఇవ్వాలని డీజీపీని సుప్రీం కోర్టు ఆదేశించింది.
    May 18, 2018, 11:53 am IST

    ఫ్లోర్ టెస్టును ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు.
    May 18, 2018, 11:53 am IST

    సుప్రీం కోర్టు తీర్పు ఆహ్వానించదగ్గదని, రేపు తమ బలం నిరూపించుకుంటామని, అధికారంతో ఏమైనా చేయవచ్చునని భావించే వారికి సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు అని కాంగ్రెస్ తరఫు లాయర్ అశ్వని కుమార్ అన్నారు.
    May 18, 2018, 11:48 am IST

    శనివారం సాయంత్రం ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో హైదరాబాదులోని జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి బెంగళూరు బయలుదేరనున్నారు.
    May 18, 2018, 11:47 am IST

    యడ్యూరప్ప నియమించిన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్ని సుప్రీం కోర్టు నిలిపివేసింది.
    May 18, 2018, 11:35 am IST

    యడ్యూరప్ప రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఫ్లోర్ట్ ఉండనుంది. ఈ మేరకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల గడువు కోరిన బీజేపీ పిటిషన్‌ను తిరస్కరించింది.
    May 18, 2018, 11:34 am IST

    ఫ్లోర్ టెస్టుకు తమకు కొంత సమయం కావాలని బీజేపీ లాయర్ ముకుల్ రోహిత్గీ కోరారు.
    May 18, 2018, 11:26 am IST

    రేపు (శనివారం) ఫ్లోర్ టెస్టుకు బీజేపీ కూడా ఓకే చెప్పాలి. బీజేపీ తరఫున వాదించిన ముఖుల్ రోహిత్గీ సుప్రీం ఆదేశాలపై స్పందించారు.
    May 18, 2018, 11:17 am IST

    రేపు (శనివారం) ఫ్లోర్ టెస్టుకు మేం సిద్ధమని కాంగ్రెస్ సుప్రీం కోర్టుకు తెలిపింది.
    May 18, 2018, 11:16 am IST

    యడ్యూరప్ప తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని నోటి వ్యాఖ్యలతో చెబుతున్నారని, కానీ ఆ ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి రాతపూర్వక మద్దతు లేదని కాంగ్రెస్ లాయర్ సింఘ్వీ అన్నారు.
    May 18, 2018, 11:15 am IST

    బలం నిరూపించుకునేందుకు అదే సరైన ఆప్షన్ అని జస్టిస్ సిక్రీ అన్నారు. ఫ్లోర్ టెస్ట్ బెస్ట్ ఆప్షన్ అన్నారు.
    May 18, 2018, 11:14 am IST

    మీకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లను చెప్పవచ్చుగా అని సుప్రీం కోర్టు బీజేపీని ప్రశ్నించింది.
    May 18, 2018, 11:12 am IST

    జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలం ఉందని, కానీ బీజేపీని ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారని కాంగ్రెస్ తరఫు లాయర్ సింఘ్వీ వాదించారు. బీజేపీకి మెజార్టీ లేదని కాంగ్రెస్ వాదించింది.
    May 18, 2018, 11:11 am IST

    యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, గవర్నర్ నిర్ణయంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ సింఘ్వీ, బీజేపీ తరఫున ముఖుల్ రోహిత్గీ, కేంద్రం తరఫున ఏజీ వేణుగోపాల్ వాదనలు వినిపిస్తున్నారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తున్నారు. యడ్యూరప్పకు ఉన్న బలంకు సంబంధించిన వివరాలను ముఖుల్ రోహిత్గీ సుప్రీంకు అందించారు. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ముఖులు రోహిత్గీ సుప్రీంకు తెలిపారు. రెండు, మూడు స్థానాల్లో ఉన్న పార్టీలు చాలా దూరంలో ఉన్నాయన్నారు. మీకు తగిన సంఖ్యాబలం ఉంటే రేపే (శనివారం) ఫ్లోర్ టెస్ట్‌కు ఆహ్వానించవచ్చా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
    May 18, 2018, 11:00 am IST

    యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది.
    READ MORE

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+