కొడుకు కంటే పెళ్లయిన కూతురు ఏ రకంగా తక్కువ..?: క్లారిటీ ఇచ్చిన కోర్టు తీర్పు
బెంగళూరు: పెళ్ళి చేసుకున్నంత మాత్రానా ఓ తండ్రికి కూతురు కూతురు కాకుండా పోదని కర్నాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. కుమారుడికి ఎంత అయితే హక్కు ఉంటుందో అంతే సమానంగా కూతురుకు కూడా కలిగి ఉంటుందని అభిప్రాయపడింది. సైనిక్ వెల్ఫేర్ గైడ్‌లైన్స్ పై దాఖలైన పిటిషన్‌ను విచారణ చేసిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. డిఫెన్స్‌లో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తుల పిల్లలు డిపెండెంట్ కార్డులను వినియోగించుకోవచ్చు. అయితే పెళ్లయిన మహిళలు ఇందుకు అర్హులు కారని కేవలం కుమారులు మాత్రమే డిపెండెంట్ కార్డులు వినియోగించుకునేందుకు అర్హులంటూ సైనిక్ వెల్ఫేర్ బోర్డు తన గైడ్‌లైన్స్‌లో పొందుపర్చింది.
ఒక వేళ రక్షణ రంగంలో పనిచేసిన కుమారుడికి పెళ్లయినా కాకపోయినా తన కొడుకుగానే ఉన్నప్పుడు కూతురును కూడా అలానే గుర్తించాలంటూ కోర్టు పేర్కొంది.కేవలం పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె కూతురు కాకుండా పోతుందా అని జనవరి 2వ తేదీన జరిగిన విచారణలో ఏకసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.అంతేకాదు ఇక నుంచి రక్షణ రంగంలో పనిచేసి రిటైర్ అయిన వారిని ఎక్స్ సర్వీస్‌మెన్ అని పిలవరాదని.. ఎక్స్ సర్వీస్ పర్సనల్ అని పిలవాలని కేంద్రాన్ని సూచించింది. లింగ సమానత్వం పాటించాలని పేర్కొంది.

డిపెండెంట్ కార్డు తను కూడా వినియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ మాజీ సైనికుడు సుబేదార్ రమేష్ ఖండప్ప 31 ఏళ్ల కూతురు ప్రియాంక పాటిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.రమేష్ ఖండప్ప 2001లో ఆపరేషన్ పరాక్రమ్‌లో భాగంగా మైన్స్‌ను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అమరుడయ్యాడు. ఆ సమయంలో రమేష్ ఖండప్ప కూతురు ప్రియాంక పాటిల్‌కు పదేళ్ల వయసు.డిపెండెంట్ కార్డు జారీ చేయాలని కోరగా... తాను పెళ్లి చేసుకుంది కనుక ఇవ్వడం కుదరదంటూ సైనిక్ వెల్ఫేర్ బోర్డు తేల్చి చెప్పింది. దీంతో 2021లో ప్రియాంకా పాటిల్ న్యాయం చేయాలంటూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది.

తనను డిఫెన్స్ పర్సనల్ కూతురుగా గుర్తించి కర్నాటక ప్రభుత్వం ఉద్యోగాల్లో డిఫెన్స్ పర్సనల్ కోటాలో ఇస్తోన్న 10శాతం రిజర్వేషన్ తనకూ అమలయ్యేలా చూడాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.2020లో డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల కోసం ఉద్యోగ ప్రకటన వెలువడింది. అయితే డిఫెన్స్ పర్సనల్ కోటా కింద అప్లయ్ చేసుకునేందుకు డిపెండెంట్ కార్డు జారీ చేయాలంటూ సైనిక్ వెల్ఫేర్ బోర్డును కోరగా... తాను పెళ్లి చేసుకుంది కాబట్టి కార్డును జారీ చేయలేమని స్పష్టం చేసింది. పెళ్లి కాని మహిళలకు మాత్రమే కార్డు ఇస్తామని చెప్పడంతో ప్రియాంకా న్యాయం కోసం పోరాడి చివరకు విజయం సాధించింది. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ అందరూ సమానులే అని సూచిస్తోందని, కాబట్టి పెళ్లయిన మహిళలు కూడా కారుణ్య నియామకాలతో పాటు లింగ విబేధం కారణంగా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ కోల్పోయి ఉంటే వాటికి కూడా అర్హులే అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది కర్నాటక హైకోర్టు.

-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications