రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలు బంద్.. ఉబర్, ర్యాపిడోలకు బిగ్ షాక్
ఈ రోజుల్లో చాలా మంది ర్యాపిడూ, ఉబర్, ఓలా లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. అంతలా ఈ యాప్స్ జనజీవనంలో కలిసిపోయాయి. నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు ర్యాపిడో, ఉబర్ లు వాడుతుంటారు. ర్యాపిడో, ఉబర్ లో వెళితే సమయం ఆదా కావడంతో పాటు తక్కువ ఖర్చులో ప్రయాణం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు బిగ్ షాక్. జూన్ 16 నుంచి కర్ణాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం నగరాల్లో ర్యాపిడో, ఉబర్ లాంటి బైక్ ట్యాక్సీ సేవలు ఊపందుకున్నాయి. మెట్రో నగరాల్లో అయితే నిత్యం వేల మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. సమయం ఆదాతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చని ప్రజల అభిప్రాయం అయితే అలాంటి వారికి ఇప్పుడు కర్ణాటక హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. జూన్ 16 నుంచి బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేస్తూ తీసుకున్న కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ర్యాపిడో, ఉబర్ సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ర్యాపిడో, ఉబర్ లాంటి బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించింది. జూన్ 16 నుంచి రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసకుంది. బైకులను కమర్షియల్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలుగా వినియోగించ వద్దని సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీలు తప్పు బట్టాయి. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించాయి.
జూన్ 16 నుంచి బైక్ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ర్యాపిడో, ఉబర్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిషేధాన్ని నిలిపివేయాలని కోరాయి. అయితే హైకోర్టులో బైక్ ట్యాక్సీ సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కర్ణాటక రవాణాశాఖ రూల్స్ ప్రకారం.. టూ వీలర్స్ ను వాణిజ్య సేవలకు వినియోగించకూడదన్న నిబంధనను హైకోర్టు సమర్థించింది.

ఒకవేళ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వులను కాదని ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి దేశంలోనే టెక్ రాజధానుల్లో ఒకటైన బెంగళూరులో బైక్స్ ట్యాక్సీల రద్దుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు. మరి ఎంతకాలం ఈ నిషేధం కొనసాగుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications