ఉద్యోగం కావాలా, వద్దా తేల్చుకోండి, ప్రభుత్వ వైద్యులకు మంత్రి వార్నింగ్, క్యూలో!
బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవ చెయ్యకుండా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహిస్తారా ? మీకు ఉద్యోగాలు కావాలా, వద్దా తేల్చుకోండి అంటూ కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు ప్రభుత్వ వైద్యులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఉద్యోగాల కోసం యువత క్యూలో ఉందని మంత్రి బళ్లారి శ్రీరాములు అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులు
కోడుగులోని మడికేరిలోని ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి బళ్లారి శ్రీరాములు పరిశీలించారు. గురువారం రాత్రి మడికేరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మంత్రి శ్రీరాములు బస చేశారు. మడికేరి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల కష్టసుఖాలను మంత్రి బళ్లారి శ్రీరాములు అడిగి తెలుసుకున్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులు
ఈ సందర్బంగా మంత్రి బళ్లారి శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ చాల మంది వైద్యులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారని, ఉద్యోగం సక్రమంగా చెయ్యకుండా ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించి ప్రజలను దోచుకుంటున్నారని తనకు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

ఉద్యోగం కావాలా, వద్దా తేల్చుకోండి
ఉద్యోగాలు చేస్తే సక్రమంగా చెయ్యండి, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లి పోవాలని మంత్రి బళ్లారి శ్రీరాములు ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించారు. ఇక్కడ వైద్యుల కొరత లేదు, మీరు రాజీనామా చేస్తే ఉద్యోగాలు చెయ్యడానికి యువత క్యూలో ఉందని మంత్రి శ్రీరాములు ప్రభుత్వ వైద్యులకు చెప్పారు.

రెండు పడవల ప్రయాణం
ఒకే సారి రెండు పడవల్లో ప్రయాణం చెయ్యడం సాధ్యం కాదని, చేస్తే ప్రభుత్వ ఉద్యోగం చెయ్యాలని, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టుకోవాలని ప్రభుత్వ వైద్యులకు మంత్రి బళ్లారి శ్రీరాములు సూచించారు. మంత్రి బళ్లారి శ్రీరాములు వార్నింగ్ తో ప్రభుత్వ వైద్యులు హడలిపోయారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications