మాజీ డీసీఎం, ఎంపీకి వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు, నోరు పారేసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది !
అవమానకరమైన మాటలు మాట్లాడకూడదని, ఇలాగే నోరు పారేసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని కర్ణాటక హైకోర్టు కర్ణాటక మాజీ మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప, బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డేలను హెచ్చరించింది. అరెస్టు చేస్తారని భయంతో ఉన్న బీజేపీ నాయకులు కేఎస్. ఈశ్వరప్ప, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే హైకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రస్తుతం ఇద్దరు బీజేపీ నాయకులు అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. మీరు మాట్లాడే భాషపై కూడా మీకు నియంత్రణ ఉండాలని కర్ణాటక హైకోర్టు వారిద్దరినీ హెచ్చరించింది. కుమట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ప్రత్యేక బెంచ్‌లో జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ విచారించారు. బీజేపీ ఎంపీ పిటిషన్ విచారణ చేసిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఆయనకు సున్నితంగానే చివాట్లు పెట్టారు.

మాట్లాడే భాషాను హద్దుల్లో పెట్టుకోవాలని న్యాయమూర్తి బీజేపీ ఎంపీని హెరించారు. మీ పిటిషనర్ బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేకు చెప్పండి, ఇక ముందు మాట్లాడే సమయంలో బాష మీద పట్టుఉండాలని, నోరు జారి ఇతరులను ఇబ్బంది పెడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని చెప్పాలని బీజేపీ ఎంపీ న్యాయవాదికి కర్ణాటక హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అర్ధంలేని పదాలతో మాట్లాడటం మంచిదికాదని, అందరి ముందు మాట్లాడే సమయంలో భాష వాడకంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కర్ణాటక హైకోర్టు బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డేని హెచ్చరించింది.
మీ దరఖాస్తుదారులకు (బీజేపీ ఎంపీకి) గౌరవప్రదంగా ప్రవర్తించడం నేర్పండి అంటూ ఆయన న్యాయవాదిని కర్ణాటక హైకోర్టు హెచ్చరించింది. బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేపై నమోదైన కేసులో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన కర్ణాటక హైకోర్టు విచారణను వాయిదా వేసింది. హిందూ, ముస్లిం వర్గాల మధ్య మతసామరస్యానికి భంగం కలిగించేలా, ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కించపరిచే ఏకవచన పదజాలంతో ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే దూషించారని ఆయన మీద కుమటా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అదేవిధంగా కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్పకు కర్ణాటక హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ నాయకులు వాళ్లు ఉపయోగించే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు కోర్టుసూచించింది. దేశ విభజన గురించి మాట్లాడే వారిని కాల్చి చంపేలా చట్టం తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప మాట్లాడటంతో ఆయన మీద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై కోర్టు తాత్కాలిక స్టే విధించింది.
నాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో పాటు తదుపరి చట్టపరమైన చర్యలపై స్టే విధించాలంటూ కేఎస్ ఈశ్వరప్ప దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు ప్రత్యేక బెంచ్‌లో ఉన్న జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ విచారించారు. మన రాజకీయ నేతలు ఎందుకు మంచి భాషను ఉపయోగించరు?, వారు మాట్లాడేటప్పుడు మంచి బాషను, సంస్కృతిని ఎందుకు ప్రతిబింబించరు' అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు స్పృహతో ఉండాలని, వారి మాటలను బడి పిల్లలు గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రాజకీయ నాయకులను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు.
-
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications