మాజీ మంత్రికి హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యే పదవికి ఎసరు ?, వేణుస్వామి ఎఫెక్ట్ !
బెంగళూరు/హాసన్: కర్ణాటక మాజీ మంత్రి, హాసన్ జిల్లాలోని హలేనరసీపూర నియోజకవర్గం జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్. డీ. రేవణ్ణ ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో మాజీ మంత్రికి కష్టాలు ఎదురైనాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హెచ్ డీ. రేవణ్ణ 88,103 ఓట్లతో విజయం సాధించారు. హలేనరసీపూర నియోజకవర్గం జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్. డీ. రేవణ్ణ ఎన్నికను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో ఆయనకు ఇప్పుడు ఇబ్బందులు ఎదురైనాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 88,103 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల వివాదం పిటిషన్ బుధవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి మూలిమణి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పిటిషనర్ తరఫు న్యాయవాది హెచ్. డీ. రేవణ్ణ భారీ అక్రమాలకు పాల్పడి గెలిచారన్నారు. దీనికి తోడు పోలింగ్‌లో 2వ స్థానంలో నిలిచిన శ్రేయాస్ పటేల్ కూడా ఓటర్లను ప్రలోభపెట్టాడు. కాబట్టి వారిద్దరి ఓటు చెల్లదని కోర్టును అభ్యర్థించారు. దరఖాస్తులో, హెచ్. డి. రేవణ్ణ, శ్రేయాస్ ఎం. పటేల్, గీతా శివస్వామి, బి. కె. నాగరాజు, హెచ్. ఎస్. తారేష్, డి. ఆర్. రంగస్వామితోపాటు రంగంలో ఉన్న వారందరినీ ప్రతివాదులుగా చేశారు.
ఎన్నికలలో హెచ్ డీ రేవణ్ణ 88,103, రెండో అభ్యర్థి శ్రేయాస్ ఎం. పటేల్‌కు 84,951 ఓట్లు రాగా, పిటిషనర్, ప్రముఖ న్యాయవాది దేవరాజ్ గౌడకు 4, 850 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. రేవణ్ణ పెద్దఎత్తున ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951, ప్రవర్తనా నియమావళి నియమాలు, 1961 మరియు 2006 మార్గదర్శకాలు అక్రమ ఓట్లను చెల్లుబాటు కావని వాటిని పరిగణించడానికి అనుమతించవని పిటిషన్ తరపున న్యాయవాది వాదించారు.

అందువల్ల హెచ్.డీ. రేవణ్ణ ఎంపికను రద్దు చేయాలని, పిటిషనర్ ఎంపికైనట్లు ప్రకటించాలని ఆయన న్యాయవాది హైకోర్టుకు మనవి చేశారు. రేవణ్ణ సమర్పించిన నామినేషన్ పత్రం లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన ఆస్తితో పాటు ఆయన సతీమణి భవాని రేవణ్ణ ఆస్తుల వివరాల గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదని, అనేక వివరాలను దాచిపెట్టారన్నారని కోర్టుకు చెప్పారు.
ఇంత జరిగినా రిటర్నింగ్ అధికారి హెచ్.డీ. రేవణ్ణ ఎన్నికను రద్దు చెయ్యాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు మనవి చేశారు. ఈ పిటిషన్ విచారణ సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే రేవణ్ణ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని హైకోర్టులో విచారణ జరిగిన రోజే మాజీ మంత్రి రేవణ్ణ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంతలోనే ఇంత జరిగింది.












Click it and Unblock the Notifications