Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ గాంధీ దెబ్బకు కర్ణాటక హోం శాఖ మంత్రి రాజీనామా: దిమ్మతిరిగింది !

కాంగ్రెస్ పార్టీలో తాను ఓ కార్యకర్తను, పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు పని చేస్తానని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నామని కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీలో తాను ఓ కార్యకర్తను, పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు పని చేస్తానని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నామని కర్ణాటక హోం శాఖ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. గురువారం ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను మంత్రి సిద్దరామయ్యకు ఇచ్చారు.

గురువారం ఆయన వికాస సౌధ (విధాన సౌధ పక్కన) డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. హైకమాండ్ ఆదేశాల మేరకు తాను హోం శాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను ఇక ముందు కేపీసీసీ అధ్యక్షుడిగా మాత్రమే పని చేస్తానని డాక్టర్ జీ. పరమేశ్వర్ వివరించారు.

Karnataka home minister Dr G Parameshwara offers to resign

కర్ణాటకలో శాసన సభ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కేవలం తాను పార్టీ కార్యకలాపాలకే సమయం కేటాయించవలసి వస్తోందని అన్నారు. మంత్రి పదవి, పార్టీ పదవి రెండు చూసుకోవడం కష్టంగా ఉంటుందని హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకోందని పరమేశ్వర్ చెప్పారు.

2018 శాసన సభ ఎన్నికల్లో సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోనే పోటీ చేస్తామని పరమేశ్వర్ వివరించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా తాను మూడో సారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని, హైకమాండ్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఈ సందర్బంగా సోనియా, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నానని పరమేశ్వర్ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+