సంతకం మిస్: హోం మంత్రి నామినేషన్ రద్దు చెయ్యండి, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు!
బెంగళూరు: బెంగళూరులోని బీటీఎం లేఔట్ శాసన సభ నియోజక వర్గం నుంచి కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పోటీ చేస్తూ నామినేషన్ వేశారు. హోం మంత్రి రామలింగా రెడ్డి సంతకం చెయ్యలేదని, ఆయన నామినేషన్ పత్రాలు రద్దు చెయ్యాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

సంతకం లేదు
కర్ణాటక హోం మంత్రి రామలింగా రెడ్డి ఎన్నికల నియమాలు ఉల్లంఘించి సంతకం చెయ్యకుండా నామినేషన్ పత్రాలు సమర్పించారని, అయినా ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించి పరిశీలించి విషయం తెలిసినా వాటిని అంగీకరించారని ఎన్నికల కమిషన్ కు కన్నడ పోరాట సంఘం నాయకుడు నాగేష్ ఫిర్యాదు చేశారు.

25 పేజీల అఫిడవిట్
బెంగళూరులోని బీటీఎం లేఔట్ శాసన సభ నియోజక వర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కర్ణాటక హోం మంత్రి రామలింగా రెడ్డి 25 పేజీల అఫిడవిట్ ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. 25 పేజీల అఫిడవిట్ లో ఒక్క చోట మాత్రం సంతకం చెయ్యడం రామలింగా రెడ్డి మరిచిపోయారు.

13వ పేజీలో ఏముంది!
కర్ణాటక హోం మంత్రి రామలింగా రెడ్డి సమర్పించిన నామినేషన్ పత్రాల్లోని 13వ పేజీలో ఆయన మీద ఉన్న కేసుల వివరాలు పూర్తి చెయ్యాలి. అయితే 13వ పేజీలో కేసుల వివరాలు ఉన్న చోట రామలింగా రెడ్డి సంతకం చెయ్యడం మరిచిపోయారు.

కొంప ముంచింది
13వ పేజీలతో తప్పా మిగిలిన అన్ని పేజీల్లో రామలింగా రెడ్డి సంతకం చేశారు. ఇప్పుడు ఆ ఒక్క విషయాన్ని ముందు పెట్టుకుని హోం మంత్రి రామలింగా రెడ్డి నామినేషన్ పత్రాలను తిరస్కరించాలని కన్నడ పోరాట సంఘం నాయకుడు ఉమేష్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications