అపోజిషన్ మాజీ సీఎం కొడుక్కి ఫోన్ చేసిన డీకే శివకుమార్. ఏం జరిగింది ?
బెంగళూరు/రామనగర్: రాజకీయాల్లో చిరకాల మిత్రులు, శత్రువులు ఉండరని మరోసారి రుజువు అయ్యింది. కర్ణాటక రాజకీయాల్లో డీకే. శివకుమార్ కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కర్ణాటకలోని అతి తక్కువ మాస్ లీడర్లలో డీకే. శివకుమార్ కూడా ఒకరు. అపోజిషన్ నాయకుడు, మాజీ సీఎం కుమారుడికి డీకే శివకుమార్ ఫోన్ చేసి మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో ఒక్కలిగ నాయకుల్లో బలమైన నాయకుడిగా మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఉన్నారు. హెచ్ డీ దేవేగౌడ తరువాత హెచ్ డీ. కుమారస్వామి, తరువాత డీకే శివకుమార్ ఉన్నారు. కేపీసీసీ అధ్యక్షుడిగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన డీకేశివకుమార్ ఇప్పుడు సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు.

మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి రామనగర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన నిఖిల్ కుమారస్వామి నిరాశ చెందారు. గత లోక్ సభ ఎన్నికల్లో మడ్య నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామి ప్రముఖ నటి, తెలుగింటి ఆడపడుచు, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతా అంబరీష్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

రామనగర జేడీఎస్ పార్టీకి కంచుకోట. మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఇదే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కొడుకు నిఖిల్ కుమారస్వామి కోసం పోటీ నుంచి తప్పుకున్న అనితా కుమారస్వామి నిఖిల్ కుమారస్వామిని అక్కడ పోటీ చేయించారు.
నిఖిల్ కుమారస్వామి రామనగరలో విజయం సాధిస్తారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ రామనగర ప్రజలు నిఖిల్ కుమారస్వామిని చిత్తుగా ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నిఖిల్ కుమారస్వామికి ఫోన్ చేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ఆయనకు ధైర్యం చెప్పారు.

మీ కుటుంబంలో ప్రధాని అయ్యారు. సీఎంలు అయ్యారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, ఎలాంటి రాజకీయా నేపథ్యంలేని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని, నువ్వు ధైర్యం ఆనియోజక వర్గంలో తిరుగు, ముందు ముందు నిన్ను మంచి పదవులు వరిస్తాయని డీకే శివకుమార్ జేడీఎస్ పార్టీ కర్ణాటక యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామికి ధైర్యం చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications