షాకింగ్: అయిదు నెలల కిందట నిశ్చితార్థం..వచ్చే ఏడాది పెళ్లి: అంతలోనే ప్రేమికుల ఆత్మహత్య.. !
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న కారణానికే వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయిదు నెలల కిందటే వారికి నిశ్చితార్థమైంది. వచ్చే ఏడాదిలో వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో వారిద్దరూ ప్రేమికులిద్దరూ వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
మృతుల పేర్లు రేఖా పుజారి, విష్ణు హగలాపుర. హుబ్బళ్లిలోని బసవేశ్వర నగర, బండి మహాకాళి నగరలో వారు నివాసం ఉంటున్నారు. ఈ రెండు ప్రాంతాలు సమీపంలోనే ఉండటంతో రేఖా, విష్ణు తరచూ కలుసుకునే వారు. వారి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది. మూడేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. ఆరు నెలల కిందట వారు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేశారు.

మొదట్లో వారి ప్రేమ వివాహాన్ని రెండు కుటుంబాల్లోని పెద్దలు అంగీకరించలేదు. రేఖ, విష్ణు పట్టుదలకు పోవడంతో పెద్దలు మెత్తబడ్డారు. విష్ణు తల్లిదండ్రులు సురేష్ హగలవాపుర, దేవక్క హగలాపుర నేరుగా రేఖ ఇంటికి వెళ్లి వారిని ఒప్పించారు. అయిదు నెలల కిందట నిశ్చితార్థాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది జనవరిలో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థమైన తరువాత వారిద్దరి రేఖ, విష్ణు మధ్య బంధం మరింత గట్టి పడింది. తరచూ కలుసుకునే వారు, ఫోనులో మాట్లాడుకునే వారు.
బుధవారం సాయంత్రం ఎప్పట్లాగే విష్ణుకు ఫోన్ చేశారు. దీనికి అతను స్పందించలేదు. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ.. విష్ణు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు రేఖను హుబ్బళ్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున ఆమె మరణించారు. రేఖ తల్లి శారద పుజారి ఈ విషయాన్ని విష్ణుకు తెలియజేశారు.

ఈ విషయం తెలుసుకున్న విష్ణు ఆషుపత్రికి వెళ్లాడు. రేఖ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం తరలించిన విషయం తెలుకుని, ఒంటరిగా ఇంటికి వెళ్లారు. ఇంట్లో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సి రెండు కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. విష్ణు, రేఖ మృతదేహాలకు ఒకే చోట అంత్యక్రియలను నిర్వహించారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications