ఫేస్‌బుక్‌లో టిప్పుసుల్తాన్‌పై వ్యాఖ్య, విద్యార్థి అరెస్ట్
బెంగళూరు: టిప్పు సుల్తాన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కర్నాటకలో ఓ ఐటీఐ విద్యార్థిని అరెస్టు చేసిన సంఘటన మంగళవారం నాడు జరిగింది. కొద్ది రోజుల క్రితం కర్నాటకలో టిప్పుసుల్తాన్ అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇప్పుడు మరోసారి ఈ అంశం వివాదాస్పదమైంది.
సమాచారం మేరకు... కర్ణాటకలోని కొప్పాలలో ఐటీఐ చదువుతున్న మంజునాథ్ ముద్గల్ అనే విద్యార్థి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో టిప్పు సుల్తాన్ ఫొటోలు పెట్టడమే కాక వాటిని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మంజునాథ్‌ను అరెస్ట్ చేశారు.

అతను ఫేస్‌బుక్ అకౌంటులో టిప్పుసుల్తాన్ ముఖాన్ని డీఫేస్ చేసాడు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన టిప్పు సుల్తాన్ ఫొటోలతో పాటు వ్యాఖ్యలను కూడా తొలగించాలని అతడికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది.












Click it and Unblock the Notifications