మంత్రి రాజీనామా ?, భర్త కోసం భార్య బ్యాటింగ్, ఎవరైనా ఒక్కటే, పదవుల కోసం లొల్లి !

బెంగళూరు: కర్ణాటకలో మంత్రి పదవులు, మంత్రులకు శాఖల కేటాయింపులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే విషయంలో సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే, మంత్రి సీటీ. రవి భార్య పల్లవి తెర మీదకు వచ్చారు. మంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పదవి కావాలని తన భర్త సీటీ. రవి ఎప్పుడూ హైకమాండ్ ను అడగలేదని ఆయన భార్య పల్లవి అన్నారు. భర్త సీటీ. రవి కోసం బ్యాటింగ్ చెయ్యడానికి ఆయన భార్య పల్లవి తెరమీదకు వచ్చారు. పదవుల కోసం అప్పుడే లొల్లి మొదలైయ్యింది.

ప్రజల మనవిషి

ప్రజల మనవిషి

చిక్కమగళూరులో సీటీ. రవి భార్య పల్లవి మీడియాతో మాట్లాడారు. సీటీ. రవి ఎప్పుడూ ప్రజల కోసం పని చేస్తారని, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం వారి మధ్యనే ఉంటారని పల్లవి అన్నారు. ఇప్పుడు తన భర్త సీటీ. రవికి ఏం చెయ్యాలని అనిపిస్తే అదే చేస్తారని పల్లవి చెప్పారు. ఏ పదవి అయినా తన భర్త సమర్థవంతంగా నిర్వహిస్తారని, మిగిలిన విషయాలు ఆయన వ్యక్తిగతం అని సీటీ రవి భార్య పల్లవి చెప్పారు.

ప్రభుత్వ కారు వెనక్కి

ప్రభుత్వ కారు వెనక్కి

ప్రైవేటు కార్యక్రమాలకు ప్రభుత్వం కేటాయించిన కార్లు ఉపయోగించడం మంచి పద్దతి కాదని మంత్రి సీటీ. రవి భార్య పల్లవి అన్నారు. ప్రైవేటు కార్యక్రమానికి హాజరుకావడానికి వెలుతున్న సమయంలో సోమవారం తన భర్త సీటీ. రవి ప్రభుత్వ కారును వెనక్కి పంపించి ఉంటారని, అందులో వేరే ఉద్దేశం లేదని ఆయన భార్య పల్లవి చెప్పారు. సీఎం యడియూరప్పకు తన భర్త సీటీ. రవికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని పల్లవి స్పష్టం చేశారు.

సీఎం యడియూరప్ప

సీఎం యడియూరప్ప

సోమవారం రాత్రి (ఆగస్టు 26) 17 మంది మంత్రులకు సీఎం యడియూరప్ప వివిద శాఖలు కేటాయించారు. చిక్కమగళూరు ఎమ్మెల్యే, మంత్రి సీటీ. రవికి పర్యాటక, కన్నడ, సాంసృతిక శాఖలు కేటాయించారు. అయితే తనకు ప్రాధాన్యత ఉన్న శాఖను కేటాయిస్తారని ఎదురు చూసిన మంత్రి సీటీ. రవికి చివరికి నిరాశ ఎదురైయ్యిందని సమాచారం.

పార్టీలో సీఎం, సీటీ రవి ఒక్కటే

పార్టీలో సీఎం, సీటీ రవి ఒక్కటే

బీజేపీలో సీఎం యడియూరప్ప అయినా, తన భర్త సీటీ. రవి అయినా ఒక్కటే అని, పార్టీ అప్పగించిన పనిని అందరూ సమర్థవంతంగా నిర్వహించాలని పల్లవి అన్నారు. అందరూ కలసి పని చేస్తారనే నమ్మకం తనకు ఉందని, మంత్రి పదవి, శాఖల కేటాయింపు విషయంలో తన భర్త సీటీ. రవి తనతో ఇంత వరకు చర్చించలేదని పల్లవి వివరించారు.

 మంత్రి పదవికి రాజీనామా ?

మంత్రి పదవికి రాజీనామా ?

శాఖల కేటాయింపు విషయంలో అసహనం వ్యక్తం చేసిన మంత్రి సీటీ రవి ఆయన పదవికి రాజీనాయా చేశారని ప్రచారం జరిగింది. రాజీనామా లేఖను సీఎం యడియూరప్పకు పంపించారని సమాచారం. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చాల మంది ఉన్నారని, తన పదవికి వారికి ఇవ్వాలని సీఎం యడియూరప్పకు మనవి చేసిన సీటీ రవి ప్రభుత్వం ఇచ్చిన కారును వెనక్కి పంపించారని కన్నడ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీని వీడడం లేదని, బతికినా చచ్చినా బీజేపీలోనే ఉంటానని మంత్రి సీటీ. రవి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+