కాంగ్రెస్ మంత్రికి అరెస్టు భయం, రంగంలోకి ఈడీ, బీజేపీ ప్లాన్, ఆపరేషన్ కమల, ప్రభుత్వం!
బెంగళూరు: కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్, ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ ను ఈడీ అధికారులు అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అవినీతి ఆరోపణలు, అక్రమాస్తులు సంపాధించారని డీకే సోదరులు ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.
కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు డీకే. సురేష్ మీద ఈడీ అధికారులు ఎఫ్ఐర్ నమోదు చేశారని. సోమవారం వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. డీకే. శివకుమార్, ఆయన సోదరుడు డీకే. సురేష్ ను విచారణ చేసిన తరువాత అరెస్టు చేస్తారని సమాచారం.
బీజేపీలో చేరాలని తన సోదరుడు, మంత్రి డీకే. శివకుమార్ మీద సీబీఐ, ఆదాయపన్ను శాఖ, ఈడీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే లేఖ రాశారు. బీజేపీ నాయకులు తమను పార్టీ మారాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారని డీకే. సురేష్ ఆరోపిస్తున్నారు.

డీకే. శివకుమార్ మీద చర్యలు తీసుకోవాలని 2017లోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆదాయపన్ను శాఖ, ఈడీ అధికారులు లేఖ రాశారని డీకే. సురేష్ ఆరోపించారు. బీఎస్ యడ్యూరప్ప రాసిన లేఖ ఇదే అంటూ శనివారం డీకే. సురేష్ ఓ లేఖను మీడియాకు ఇచ్చారు.
ఇప్పటికే మంత్రి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ తయారు చేసి సోమవారం అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరగడంతో డీకే బ్రదర్స్ అనుచరుల్లో ఆందోళన మొదలైయ్యింది.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications