Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరి ఆటలు నాకు తెలుసు, కళ్లు మూసుకుని రాజకీయాలు చేస్తారా ? చూద్దాం: త్రిబుల్ షూటర్ !

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, రమేష్ జారకిహోళి ఎందుకు రాజీనామా చేశారో తనకు తెలుసని, ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు వెలుతున్నాయో అర్థం అవుతున్నాయని, కళ్లు మూసుకుని ఎవరూ రాజకీయాలు చెయ్యరని కర్ణాటక మంత్రి, త్రిబుల్ షూటర్ డీకే. శివకుమార్ అన్నారు.

బీజేపీ ఏం చేస్తుంది ?

బీజేపీ ఏం చేస్తుంది ?

బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని నివాసంలో మంత్రి డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఏం చేస్తుందో, అందుకు ఎవరు ఎలా ప్రవర్థిస్తున్నారో తనకు బాగా తెలుసని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. ఎవరో మా పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పవనసరం లేదని అంటున్న మంత్రి డీకే. శివకుమార్ పరోక్షంగా బీజేపీ నాయకులకు చురకలు అంటించారు.

కళ్లు మూసుకుని రాజకీయాలు !

కళ్లు మూసుకుని రాజకీయాలు !

మా పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరరని మంత్రి డీకే. శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. మాలో ఎవరు కళ్లు మూసుకుని రాజకీయాలు చెయ్యడంలేదని, ఆ విషయం ప్రతిపక్షం (బీజేపీ) గుర్తు పెట్టుకుంటే వారికే మంచిదని కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అన్నారు.

నమ్మకం ఉంది

నమ్మకం ఉంది

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆనంద్ సింగ్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారనే నమ్మకం తనకు ఉందని మంత్రి డీకే. శివకుమార్ చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావనే నమ్మకం తనకు ఉందని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు.

నేనే చూసుకుంటా !

నేనే చూసుకుంటా !

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారని, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని డీకే. శివకుమార్ చెప్పారు. కేసీ. వేణుగోపాల్ బెంగళూరు రావలసిన అవసరం లేదని, తానే అన్ని చూసుకుంటానని మంత్రి డీకే. శికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

 రివర్స్ ఆపరేషన్ ?

రివర్స్ ఆపరేషన్ ?

ఆపరేషన్ కమల మొదలుపెడితే తాము బీజేపీ ఎమ్మెల్యేలను లాక్కొవడానికి రివర్స్ ఆఫరేషన్ చేపట్టే విషయంలో వెనక్కిపోమని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన మంత్రి డీకే. శివకుమార్ ప్రస్తుత పరిస్థితేల్లో ఎవరూ కళ్లు మూసుకుని రాజకీయాలు చేసే పరిస్థితుల్లో లేరని, ఆ విషయం బీజేపీ నాయకులకు తెలుసని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+