Coronavirus: మంత్రి భార్య, కుమార్తె, తండ్రికి కరోనా పాజిటివ్, వంట మనిషి దెబ్బ, సీఎం, మంత్రులు సేఫ్ !

బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ఇప్పటికే వేలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వ్యాధితో ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు మరణించారు. ఇప్పుడు అధికారంలో ఉంటున్న వైద్య, విద్యాశాఖా మంత్రి భార్య, కుమార్తె, తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితో టచ్ లో ఉన్న నాయకులు, ప్రజలు హడలిపోతున్నారు. అయితే సీఎం అత్యవసర సమావేశానికి సదరు మంత్రి హాజరుకాకపోవడంతో సీఎంతో సహ సాటి మంత్రులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం ఏమిటంటే ఆ మంత్రి వృత్తిరీత్యా డాక్టర్ కావడం విశేషం. తన తండ్రి, భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలిందని, తనతో పాటు తన ఇద్దరు కుమారులకు కరోనా నెగటివ్ అని వచ్చిందని సదరు మంత్రి క్లారిటీ ఇచ్చారు. మంత్రి భార్య, కుమార్తె, తండ్రికి కరోనా పాజిటివ్ రావడం వెనుక ఓ ట్విస్ట్ ఉంది.

 వైద్య విద్యాశాఖ మంత్రి

వైద్య విద్యాశాఖ మంత్రి

కర్ణాటక వైద్య విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ వృత్తిరీత్యా వైద్యుడు. కర్ణాటకలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని, కరోనాకు కళ్లెం వెయ్యడానికి మా ప్రభుత్వం శక్తి వంచనలేకుండా పని చేస్తోందని చాలా రోజుల నుంచి మంత్రి డాక్టర్ సుధాకర్ మీడియా ముందు ప్రజలకు ధైర్యం చెబుతూనే ఉన్నారు.

 తండ్రికి అనారోగ్యం

తండ్రికి అనారోగ్యం

కర్ణాటక వైద్య విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ తండ్రి (82) అనారోగ్యానికి గురైనారు. వెంటనే మంత్రి సుధాకర్ తండ్రికి వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల్లో మంత్రి సుధాకర్ తండ్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తన తండ్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం తన తండ్రికి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని మంత్రి డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు. జూన్ 10వ తేదీన మంత్రి డాక్టర్ సుధాకర్ తండ్రి పుట్టిన రోజు. తండ్రి పుట్టినరోజు సందర్బంగా మంత్రి సుధాకర్ ఆయన ఫోటోను సోషల్ మీడియాలో, ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఫాదర్స్ డే రోజు తండ్రితో మంత్రి సుధాకర్ తీసుకున్న ఫోటోను మంత్రి స్వయంగా ఆయన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఇంతలోనే తండ్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో మంత్రి సుధాకర్ షాక్ కు గురైనారు.

 మంత్రి భార్య, కుమార్తెకు కరోనా

మంత్రి భార్య, కుమార్తెకు కరోనా

కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ హడలిపోయారు. వెంటనే మంత్రి డాక్టర్ సుధాకర్, ఆయన భార్య, కుమార్తె, కుమారులకు వైద్యపరీక్షలు చేశారు. వైద్యపరీక్షల ఫలితాలు వచ్చాయి. మంత్రి డాక్టర్ సుధాకర్ భార్య, కుమార్తెకు కరోనా అని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు, అనుచరులు హడలిపోయారు.

 అవును.... నిజమే... మంత్రి క్లారిటీ

అవును.... నిజమే... మంత్రి క్లారిటీ

తన తండ్రి, భార్య, కుమార్తెకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, వైద్య పరీక్షల్లో తనతో పాటు తన కుమారులకు కరోనా నెగటివ్ అని వచ్చిందని మంత్రి డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు. నియమాల ప్రకారం తన తండ్రి, భార్య, కుమార్తె ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకుంటున్నారని, త్వరగా వారు కోలుకోవాలని ప్రార్థించిన తన స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు అంటూ మంత్రి డాక్టర్ సుధాకర్ ట్వీట్ చేశారు.

 మంత్రి ఫ్యామిలీకి కరోనా ఎలా వచ్చిందంటే !

మంత్రి ఫ్యామిలీకి కరోనా ఎలా వచ్చిందంటే !

కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ ఇంట్లో పని చేస్తున్న వంట మనిషి వలన ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. వంట మనిషి ఇంట్లో వంటలు చెయ్యడం, వాటిని మంత్రి కుటుంబ సభ్యులు ఆరగించడం వలనే ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చిందని వైద్యులు, అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 సీఎం, మంత్రులు సేఫ్

సీఎం, మంత్రులు సేఫ్

సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధ్యక్షతన బెంగళూరులో మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కరోనా కట్టడి కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. సీఎం బీఎస్. యడియూరప్ప నిర్వహించిన అత్యవసర సమావేశానికి వైద్య విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ హాజరుకాలేదు. తనకు, తన కుటుంబ సభ్యులకు జలుబు, దగ్గు, జ్వరం ఉందని, అందుకే తాము హోమ్ క్వారంటైన్ లో ఉన్నామని, ఈ సమావేశానికి తాను హాజరుకావడం లేదని మంత్రి డాక్టర్ సుధాకర్ సీఎం బీఎస్. యడియూరప్పకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
     హమ్మయ్యా.... మంత్రి వచ్చుంటే ?

    హమ్మయ్యా.... మంత్రి వచ్చుంటే ?

    సీఎం బీఎస్. యడియూరప్ప సమావేశానికి మంత్రి డాక్టర్ సుధాకర్ హాజరై ఉంటే పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉండేదని బీజేపీ నాయకులు అంటున్నారని తెలిసింది. మొత్తం మీద మంత్రి డాక్టర్ సుధాకర్ సీఎం బీఎస్. యడియూరప్ప నిర్వహించిన అత్యవసర సమావేశానికి మంత్రి డాక్టర్ సుధాకర్ హాజరుకాకకపోవడం చాల మంచిది అయ్యిందని కొందరు బీజేపీ సీనియర్ మంత్రులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+