మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి చిందులు, కన్నీరు, సోషల్ మీడియాలో శాపనార్తాలు !
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి విరుచుకుపడ్డారు. అందరూ చూస్తున్న సమయంలో మహిళా ఐపీఎస్ అధికారి మీద మంత్రి సా.రా. మహేష్ బహిరంగంగా దూషణకుదిగడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తీరుపై సోషల్ మీడియాలో పలువురు మంత్రి సా.రా. మహేష్ కు శాపనార్తాలు పెడుతున్నారు.
మంగళవారం తుమకూరు సమీపంలోని సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ అంత్యక్రియలకు మంత్రి సా.రా. మహేష్ హాజరైనారు. అక్కడ తుమకూరు జిల్లా ఎస్ పీ దివ్యా గోపినాథ్ ఉన్నారు. ఆ సందర్బంలో మంత్రి సా.రా. మహేష్ మహిళా ఐపీఎస్ అధికారి దివ్యా గోపినాథ్ ను కఠినంగా మాట్లాడారు.

మంత్రి సా.రా. మహేష్ తీరుతో ఐపీఎస్ అధికారి దివ్యా గోపినాథ్ సంఘటనా స్థలంలోనే కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి సా.రా. మహేష్, మహిళా ఐపీఎస్ అధికారి దివ్యా గోపినాథ్ మద్య వాగ్వివాదం మొదలు కావడంతో స్థానిక నాయకులు, సీనియర్ పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నారు.
మంత్రి సా.రా. మహేష్ కు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించి ఐపీఎస్ అధికారి దివ్యా గోపీనాథ్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో తీసిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళా ఐపీఎస్ అధికారి దివ్యా గోపీనాథ్ తో మంత్రి సా.రా. మహేష్ ప్రవర్తించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మంత్రి సా.రా. మహేష్ కు శాపనార్తాలు పెడుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications