మరో హిట్ వికెట్ పడింది, అధికార పార్టీకి అమావాస్య ముందే షాక్, మాజీ సీఎం ఫ్రెండ్ ఔట్ !

బెంగళూరు/శివమొగ్గ: మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మర్యాద లేని చోట ఉన్నా, మర్యాద లేనివారితో కలిసి పని చేసినా మాకు మర్యాద ఉండదని ఆయనూరు మంజునాథ్ ఆయన సన్నిహితులతో వాపోయారని తెలిసింది. ప్రముఖ పార్టీ నుంచి ఆయనూరు పోటీ చెయ్యడానికి రెఢీ అయ్యారు.

శివమొగ్గ సిటీ నుంచి బీజేపీ టిక్కెట్ సంపాధించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప, బీజేపీ ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ అనేక ప్రయత్నాలు చేశారు. మధ్యలోనే కేఎస్. ఈశ్వరప్ప డ్రాప్ అయ్యారు. తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించాలని కేఎస్. ఈశ్వరప్ప అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.

Ayanuru Manjunath is resigning from BJP.

బీజేపీ ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ మాత్రం చివరి నిమిషం వరకు బీజేపీ టిక్కెట్ సంపాధించాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనూరు మంజునాథ్ కు టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. బీజేపీ తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆయనూరు మంజునాథ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు.

బుధవారం శివమొగ్గలో మీడియాతో మాట్లాడిన ఆయనూరు మంజునాథ్ తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, బీజేపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గురువారం తాను శివమొగ్గలో నామినేషన్ వేస్తున్నానని ఆయనూరు మంజునాథ్ ప్రకటించారు. ప్రముఖ రాజకీయ పార్టీతో తాను టచ్ లో ఉన్నానని, ఆ పార్టీ నాయకులే తనకు టిక్కెట్ ఇచ్చినట్లు ప్రకటిస్తారని ఆయనూరు మంజునాథ్ అన్నారు.

ఇప్పటికే జేడీఎస్ నాయకులతో ఆయనూరు మంజునాథ్ చర్చలు జరిపారని, శివమొగ్గ నుంచి జేడీఎస్ టిక్కెట్ తో ఆయన పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాను, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మంచి స్నేహితులు అని, 1994 నుంచి ఇద్దరూ బీజేపీలో పని చేస్తున్నామని, మా ఇద్దరికి మోసం జరిగిందని ఆయనూరు మంజునాథ్ సంచలన ఆరోపణలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+