కాఫీ కింగ్ మా దేవుడు, కంపెనీ షేర్లు భారీగా కొంటున్న కన్నడిగులు, సిద్దార్థ ఆశయాలు, లక్షం!

బెంగళూరు: కేఫ్ కాఫీ డే కంపెనీని కాపాడటానికి కన్నడిగులు ఒక్కటౌతున్నారు. కాఫీ కాంగ్ సిద్దార్థ మరణించిన తరువాత ఆయన ఆశయాలు కాపాడటానికి కన్నడిగులు, ముఖ్యంగా మలెనాడు ప్రజలు భారీ స్థాయిలో కేఫ్ కాఫీ డే షేర్లు కొనుగోలు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. సిద్దార్థ మరణించిన తరువాత కేఫ్ కాఫీ డే షేర్లు భారీగా పతనం అయ్యాయి. అయితే సిద్దార్థ మా దేవుడని, ఆయన కలలు కన్న కేఫ్ కాఫీ డే కంపెనీని కాపాడుకుంటామని కన్నడిగులు అంటున్నారు.

కేఫ్ కాఫీ డే షేర్లు

కేఫ్ కాఫీ డే షేర్లు

సిద్దార్థ కనపడటం లేదని మీడియాలో ప్రచారం అయిన తరువాత కేఫ్ కాఫీ డే షేర్లు పతనం అయ్యాయి. సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్నారని వెలుగు చూడటంతో కేఫ్ కాఫీ డే షేర్లు మరింత పతనం అయ్యాయి. ఇదే సమయంలో నష్టాల భారీనపడిన కేఫ్ కాఫీ డే కంపెనీని ఆదుకోవాలని వాటి షేర్లు కొనుగోలు చెయ్యడానికి కన్నడిగులు, మలెనాడు ప్రజలు ముందుకు వచ్చారు.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్

సోషల్ మీడియాలో ఫ్యాన్స్

కాఫీ డే కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే సిద్దార్థ ఆశయాలు సజీవంగా ఉంటాయని మలెనాడు ప్రజలు భావించారు. నష్టాల్లో ఉన్న కాఫీ డే షేర్లు కొనుగోలు చెయ్యడానికి మనం సిద్దం కావాలంటూ మలెనాడు ప్రజలు, సిద్దార్థ అభిమానులు సోషల్ మీడియాలో పిలిపునిచ్చారు. సోషల్ మీడియాలో సిద్దార్థ అభిమానులు ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన వచ్చింది.

ఒక్కటైన కన్నడిగులు

ఒక్కటైన కన్నడిగులు

వేలాది మంది మలెనాడు ప్రజలు కాఫీ డే షేర్లు కొనుగోలు చేస్తున్నారు. మలెనాడు ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న కన్నడిగులు భారీగా కాఫీ డే షేర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎక్కువగా మలెనాడుకు చెందిన వ్యక్తులే కాఫీ డే సంస్థ షేర్లు కొనుగోలు చెయ్యడానికి క్యూ కడుతున్నారు.

యువతకు శిక్షణ

యువతకు శిక్షణ

కాఫీ కింగ్ సిద్దార్థ కర్ణాటకలోని మలెనాడుకు చెందిన వ్యక్తి. మలెనాడుకు చెందిన వేలాది మంది యువకులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించిన సిద్దార్థ వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. మలెనాడు యువతకు సిద్దార్థ ఆదర్శంగా నిలిచారు. వేలాది మంది యువకులు సిద్దార్థను ఆదర్శంగా తీసుకుని వ్యాపారాలు చేస్తూ ముందుకు వెలుతున్నారు.

సిద్దార్ధ ఆశయాలు లక్షం

సిద్దార్ధ ఆశయాలు లక్షం

కేఫ్ కాఫీ డేని కాపాడుకోవాలని సిద్దార్థ చివరి వరకు ప్రయత్నించి విఫలం అయ్యారు. సిద్దార్థ ఆశయాలు, కలలు కాపాడుకోవడం మా భాద్యత, సిద్దార్థ మా జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు అని మలెనాడు ప్రజలు అంటున్నారు. సిద్దార్థ ఆశయాలు కాపాడుకుంటామని, ఆయన ఎంతగానో ప్రమేమించిన కాఫీ డే కంపెనీని కాపాడుకుంటామని మలెనాడు యువత అంటున్నారు. అయితే నష్టాల్లో ఉన్న కేఫ్ కాఫీ డే కంపెనీని కాపాడుకోవాలంటే మరింత మంది యువకులు వాటి షేర్లు కొనుగోలు చెయ్యడానికి ముందుకు రావాలని సిద్దార్థ అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+