ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం, సీబీఐ చార్జ్ షీట్ లో A2 ఆరోపి ఐపీఎస్ ?, దెబ్బకు దిగిపోయింది!

బెంగళూరు: కర్ణాటకలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు చార్జ్ షీట్ సిద్దం చేశారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు వారిని విచారణ చేసి వివరాలు సేకరించారు. సీబీఐ అధికారులు సిద్దం చేసిన చార్జ్ షీట్ లో A2 ఆరోపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ? పేరు ఉందని కన్నడ మీడియా అంటోంది. మొత్తం మీద ఇప్పటికే అలోక్ కుమార్ ను విచారణ చేసి వివరాలు సేకరించిన సీబీఐ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్ షీట్ తయారు చేశారని తెలిసింది.

కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!

చార్జ్ షీట్ లో అలోక్ కుమార్ పేరు ?

చార్జ్ షీట్ లో అలోక్ కుమార్ పేరు ?

కర్ణాటక ఏడీజీపీ, బెంగళూరు నగర మాజీ పోలీసు అధికారి అలోక్ కుమార్ ను ఏ 2 అరోపిగా ? చార్జ్ షీటు నమోదు చేశారని తెలిసింది. డీఎస్పీ యతిరాజ్ కేసు ఫైల్ చేసిన వివరాలను పై అధికారుల అనుమతి లేకుండా మీర్జా ఆలీ వాటి వివరాలు ఉన్న పెన్ డ్రైవ్ తీసుకెళ్లి అలోక్ కుమార్ కు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

కావాలనే చేశారు !

కావాలనే చేశారు !

లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశ పత్రాలు లేకుండా మీర్జా ఆలీ ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రస్తుత బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడానికి కారణం అయ్యారని సీబీఐ అధికారులు గుర్తించారని తెలిసింది. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేశారని, వాటి వివరాలు బయటకు రావడానికి కొంతమంది కారణం అయ్యారని వెలుగు చూసింది. ఇన్ స్పెక్టర్ మాలతేష్, డీఎస్పీ యతిరాజ్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా పరిగణలోకి తీసుకున్నారని తెలిసింది.

ఇప్పుడు ఏం చేస్తారు ?

ఇప్పుడు ఏం చేస్తారు ?

బెంగళూరు నగర మాజీ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్, సీనియర్ అధికారి మీర్జా ఆలీ తదుపరి చర్యలు ఏం తీసుకుంటారు ? సీబీఐ అధికారులతో వీరు చట్టపోరాటం చేస్తారా ? అనే విషయం వేచిచూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్, పోలీసు శాఖలోని అధికారులను విచారణ చేసి వివరాలు సేకరించారు.

వీవీఐపీల ఫోన్లు ట్యాపింగ్

వీవీఐపీల ఫోన్లు ట్యాపింగ్

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు అధికార బీజేపీ నాయకులు డిమాండ్ చెయ్యడంతో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.

సంకీర్ణ ప్రభుత్వం మీద కుట్ర ?

సంకీర్ణ ప్రభుత్వం మీద కుట్ర ?

అప్పటి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానం రావడంతో బీజేపీ నాయకులతో పాటు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వామిజీలు, సినీ ప్రముఖుల ఫోన్లు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అన్ని పార్టీ నాయకులు ఒత్తిడి చెయ్యడంతో బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం కేసు సీబీఐకి అప్పగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+