Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

బెంగళూరు/ మైసూరు: సినిమాలు, జీవితం వేరు అనే విషయం కొంత మంది మూర్ఖులు ఇంకా గుర్తించలేకపోతున్నారు. సినిమాల్లో హీరోలు పక్కాప్లాన్ తో ప్రత్యర్థులను చంపేసి తప్పించుకుని తిరుగుతున్న దృశ్యాలు మనం అనేక సినిమాల్లో చూశాం. అయితే భర్త ఫ్రెండ్ తో రాసలీలలు సాగిస్తున్న భార్య దృశం సినిమా చూసింది. సినిమా స్ట్రైల్లో భర్తను చంపించి ప్రియుడితో రొమాన్స్ చెయ్యాలని ప్లాన్ వేసింది. స్కెచ్ ప్రకారం భర్తను చంపించింది. తరువాత ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తూ తనకు ఏమీ తెలీదని రంకులాగి నాటకం ఆడింది. అయితే పోలీసుల ముందే పిల్లిగంతులు వేసిన భార్య, ప్రియుడు చిన్న విషయంలో పోలీసులకు చిక్కిపోయారు. సార్ మా తప్పు ఏమీలేదు, దృశ్యం సినిమా డైరెక్టర్ ది, ఆయన సినిమాలో చూపించినట్లు చేశాం, అందులో మా తప్పేముంది ? అని సమాధానం ఇవ్వడంతో పోలీసులు షాక్ కు గురైనారు.

సంసారం సూపర్

సంసారం సూపర్

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ తాలుకా సాలిగ్రామం పట్టణం మెయిన్ రోడ్డులో ఆనంద్, శారదా దంపతులు నివాసం ఉంటున్నారు. వ్యాపారంలో, వ్యవసాయంలో ఆనంద్ రెండు చేతులా సంపాధిస్తున్నాడు. భర్త ఆనంద్ సంపాదనతో శారదా ఇంత వరకు ఎంజాయ్ చేస్తోంది. కావలసిన నగలు, చీరలు, ఖరీదైన వస్తువులు తీసుకుంటున్న భార్య శారదాకు ఏ రోజు భర్త ఆనంద్ అడ్డం చెప్పలేదు.

భర్త ఫ్రెండ్ తో లింక్

భర్త ఫ్రెండ్ తో లింక్

భర్త ఆనంద్ కు ఎస్ఆర్. బాబు అనే స్నేహితుడు ఉన్నాడు. వ్యాపారం పని విషయంలో మాట్లాడటానికి అప్పుడప్పుడు బాబు ఆనంద్ ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఆ సమయంలో భర్త ఆనంద్ స్నేహితుడు బాబుతో శారదాకు పరిచయం అయ్యింది. తరువాత ఆనంద్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెళ్లి శారదాతో చనువుగా ఉండేవాడు. ఇలా బాబు, శారదాకు లింక్ పడింది.

బాబు బంగారం... మనం ఏంజాయ్ చేద్దాం రా

బాబు బంగారం... మనం ఏంజాయ్ చేద్దాం రా

భర్త ఆనంద్ లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న బాబుతో శారదా రాసలీలలు సాగించడం మొదలు పెట్టారు. బాబు నువ్వు బంగారం, రా ఏంజాయ్ చేద్దాం అంటూ శారదా ప్రియుడికి పదేపదే ఫోన్లు చెయ్యడం మొదలుపెట్టింది. ఇలా ఇంట్లోనే ప్రియుడు బాబుతో శారదా ఏంజాయ్ చేస్తూ గట్టుచప్పుడు కాకుండా కాపురం పెట్టేసింది.

అసలే మందు బాబు, కామ్ గా ఉంటాడా !

అసలే మందు బాబు, కామ్ గా ఉంటాడా !

భర్త ఆనంద్ మద్యం సేవించేవాడు. నువ్వు ఇంట్లో లేని సమయంలో నీ ఫ్రెండ్ బాబు ఇంటికి వచ్చి గంటలు గంటలు ఉంటున్నాడని చుట్టుపక్కల వాళ్లు ఆనంద్ కు చెప్పారు. విషయం తెలుసుకున్న ఆనంద్ రోజు పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య శారదాను పట్టుకుని చితకబాదడం మొదలు పెట్టాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటావు అంటూ భర్త ఆనంద్ రోజు భార్య శారదాను చితకబాదుతూ సినిమా చూపించాడు.

దృశ్యం సినిమా స్కెచ్

దృశ్యం సినిమా స్కెచ్


భర్త ఆనంద్ ను చంపేస్తే మనం సుఖంగా ఉంటామని, ఈ దెబ్బలు నేను తట్టుకోలేనని భార్య శారదా ప్రియుడు బాబుకు చెప్పింది. దృశ్యం సినిమాలోని కొన్ని సీన్ లు బాబుకు గుర్తుకు వచ్చాయి. శారదా, ఆమె ప్రియుడు దృశ్యం సినిమాను 10 సార్లుకు పైగా చూశారు. అంతే జూన్ 22వ తేదీ రాత్రి తన డియో స్కూటర్ లో బయటకు వెళ్లిన ఆనంద్ మరుసటి రోజు ఉదయం సాలిగ్రామం మెయిన్ రోడ్డులోని ట్రాన్స్ ఫార్మర్ పక్కన శవమై కనిపించాడు. స్కూటర్ ముందు భాగం పూర్తిగా దెబ్బ తినడం, ఆనంద్ కు తీవ్రగాయాలు కావడంతో అందరూ అది ప్రమాదం అనుకున్నారు.

మందుతాగి మైకంలో ప్రమాదం

మందుతాగి మైకంలో ప్రమాదం

ప్రతిరోజు రాత్రిపూట మద్యం సేవించి ఆనంద్ ఇంటికి వెలుతున్న సమయంలో ప్రమాదవశాత్తు స్కూటర్ ను ట్రాన్స్ ఫార్మర్ కు ఢీకొని మరణించి ఉంటాడని అందరూ అనుకున్నారు. అదే కోణంలో పోలీసులు విచారణ చేశారు. అయితే పోలీసుల విచారణలో జూన్ 22వ తేదీ రాత్రి బాబు అదే ఊరిలో నివాసం ఉంటున్న బాబు అనే స్నేహితుడితో కలిసి ఫాం హౌస్ లో మద్యం సేవించడానికి వెళ్లాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తప్పు సినిమా డైరెక్టర్ ది, మాది కాదు సార్ !

తప్పు సినిమా డైరెక్టర్ ది, మాది కాదు సార్ !


పోలీసులు ఆనంద్ భార్య శారదా, బాబు మీద నిఘా వేశారు. ఇద్దరు పదేపదే రోజు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. శారదా, ఆమె ప్రియుడు బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరికి బెండ్ తీశారు. ఆ సమయంలో తమ అక్రమ సంబంధం విషయం ఆనంద్ కు తెలిసిపోయిందని, అతని పీడ విడగించుకోవడానికి దృశ్యం సినిమా చూసి ఆందులోని సీన్ కు తగ్గట్టుగా హత్య చేశామని, ఇలా చిక్కిపోతామని అనుకోలేదని శారదా, ఆమె ప్రియుడు బాబు విచారణలో అంగీకరించాడని పోలీసులు చెప్పారు. తప్పు మాదికాదని దృశ్యం సినిమా డైరెక్టర్ ది అనే లెవల్లో శారదా, ప్రియుడు బాబు అంటున్నారని సాలిగ్రామం పట్టణ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+