Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మాయి రివర్స్, స్వామీజీ మూడో పెళ్లి మటాష్, 420 కేసులు, కండలతో హీరో సల్మాన్ ఖాన్ కు సవాల్ !

బెంగళూరు: పాదపూజ చెయ్యడానికి వచ్చిన 20 ఏళ్ల యువతితో పరారైన దత్తాత్రేయ అవధూత స్వామీజీకి సినిమా కష్టాలు ఎదురైనాయి. యువతితో ఎస్కేప్ అయిన దత్తాత్రేయ స్వామీజీ ఆమెను తిరుమలలో వివాహం చేసుకుని కొన్ని రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగి చివరికి జైలుకు వెళ్లాడు. యువతిని వివాహం చేసుకున్న దత్తాత్రేయ అవధూత స్వామీజీ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గెటప్ లో కండలు చూపిస్తూ ఆయనకే సవాలు విసురుతున్నట్లు తయారై కొన్ని రోజులకే టిక్ టాక్ వీడియోలతో అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే తనను మోసం చేసి స్వామీజీ పిలుచుకుని వెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని యువతి రివర్స్ కావడంతో దత్తాత్రేయ అవధూత స్వామీజీపై 420 కేసు నమోదు కావడంతో ఆయన సినిమా ఫక్కీలో జైలుకు వెళ్లాడు.

 స్వామీజీ ఎంత పని చేశారంటే ?

స్వామీజీ ఎంత పని చేశారంటే ?

ఫిబ్రవరి 27 తేదీన శివరాత్రి పండగ రోజు ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని హోళలి భీమలింగేశ్వర సేవాశ్రయంలో పాదపూజ చెయ్యడానికి వెళ్లిన 20 ఏళ్ల యువతితో దత్తాత్రేయ అవధూత స్వామీజీ ఎస్కేప్ అయ్యాడు. యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు స్వామీజీ మీద కేసు నమోదు చేసి ఆయన కోసం గాలించారు.

స్వామీజీ గెటప్ అదుర్స్

స్వామీజీ గెటప్ అదుర్స్

యువతితో మాయం అయిన దత్తాత్రేయ అవధూత స్వామీజీ తాను ఆమెను వివాహం చేసుకున్నానని స్వయంగా ఆయనే సన్నిహితులు, యువతి సోదరుడికి సమాచారం ఇచ్చారు. తరువాత స్వామీజీ బాలీవుడ్ హీరో లాగా గడ్డం, తల వెంట్రుకల్ నీట్ గా కట్ చేసుకుని అమ్మాయితో కలిసి అనేక ప్రాంతాల్లో నిలబడి ఫోటోలకు ఫోజు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

 స్వామీజీపై 420 కేసు

స్వామీజీపై 420 కేసు

కొన్ని రోజుల పాటు తప్పించుకుని యువతితో తిరిగిన దత్తాత్రేయ అవధూత స్వామీజీ చివరికి మంగళూరు సమీపంలోని గోకర్ణలోని గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నాడని వెలుగు చూడటంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తనను మోసం చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని యువతి అడ్డం తిరగడంతో పోలీసులు దత్తాత్రేయ అవధూత స్వామీజీ మీద 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

 9 క్రిమినల్ కేసుల్లో స్వామీజీ

9 క్రిమినల్ కేసుల్లో స్వామీజీ

యువతి స్వామీజీ మీద అడ్డం తిరగడంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె కుటుంబ సభ్యులతో ఇంటికి పంపించారు. స్వామీజీని తాము నమ్మి అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చి మోసపోయామని 9 మంది పోలీసులను ఆశ్రయించారు. దానికి తోడు దత్తాత్రేయ అవధూత స్వామీజీతో పాటు పారిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో మరో కేసు నమోదు అయ్యింది. దత్తాత్రేయ అవధూత స్వామీజీ మీద 9 క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను కోలారు సెంట్రల్ జైలుకు పంపించారు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు స్వామీజీ సవాల్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు స్వామీజీ సవాల్

యువతిని పెళ్లి చేసుకునే ముందు స్వామీజీ గుబురు గడ్డం, తల వెంట్రుకలు నీట్ గా కట్ చేసుకున్నారు. నున్నగా గడ్డం షేవ్ చేసుకున్న దత్తాత్రేయ అవధూత స్వామీజీ షర్టు తీసేసి బనియన్ తో కండలు చూపిస్తూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు సవాలు చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజు ఇచ్చారు. దానికి తోడు అంతుకు ముందు పొడవుగా పెరిగిన తలవెంకట్రుకలు వదిలేసి హర్రర్ సినిమాలో చూసినట్లు కొన్ని టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఔరా స్వామీజీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 యువతి ఫ్యామిలీకి స్వామీజీ వార్నింగ్

యువతి ఫ్యామిలీకి స్వామీజీ వార్నింగ్

యువతి అడ్డం తిరగడంతో షాక్ కు గురైన దత్తాత్రేయ అవధూత స్వామీజీ ఆమె కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకోవడానికి విఫలయత్నం చేశాడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో స్వామీజీ రెచ్చిపోయారు. కేసు వెనక్కి తీసుకోవాలని, తనను జైలు నుంచి విడుదల చేయించాలని దత్తాత్రేయ అవధూత స్వామీజీ యువతి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చేశారు. అయితే కేసు వెనక్కి తీసుకోవడానికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

 రూ. కోట్ల ఆస్తి ఉంది, మీ అంతు చూస్తా

రూ. కోట్ల ఆస్తి ఉంది, మీ అంతు చూస్తా

తనకు లెక్కలేని రూ. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, నన్ను మీరు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని, నేను జైలు నుంచి బయటకు వచ్చి మీ అంతు చూస్తానని యువతి కుటుంబ సభ్యులు బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. దత్తాత్రేయ అవధూత స్వామీజీ తమను బెదిరిస్తున్నారని, మీరే రక్షణ కల్పించాలని యువతి కుటుంబ సభ్యులు అంటున్నారని, కేసు విచారణలో ఉందని కోలారు గ్రామీణ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+