వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాప్ చేస్తానని బస్సులో యువతిని రేప్ చేశాడు (ఫొటో)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలో కదులుతున్న మిని బస్సులో ఓ డ్రైవర్ యువతి మీద అత్యాచారం చేసి జైలుపాలైనాడు. డ్రైవర్ కు సహకరించిన క్లీనర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. యువతికి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నామని పోలీసులు చెప్పారు.

శివమొగ్గకు చెందిన రవి (26), చింతామణికి చెందిన క్లీనర్ మంజు (23) అనే ఇద్దరిని అరెస్టు చేశామని శుక్రవారం పోలీసులు చెప్పారు. ప్రయివేటు కంపెనీకి చెందిన మిని బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రయివేటు నర్సింగ్ హోంలో 19 సంవత్సరాల యువతి ఉద్యోగం చేస్తున్నది. ఈమె గురువారం సాయంత్రం ఉద్యోగం ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ సందర్బంలో అటువైపు వెళ్లిన రవి తాను డ్రాప్ చేస్తానని యువతిని నమ్మించాడు.

Karnataka Police arrested Shivamogga origin Ravi(26) and Manju(23).

యువతి మిని బస్సులో కుర్చున్న తరువాత రవి క్లీనర్ మంజును బస్సు నడపమని చెప్పాడు. తరువాత బస్సు కిటికీలు అన్ని వేసి బస్సులోనే యువతి మీద రవి అత్యాచారం చేశాడు. అనంతరం సూలిబెల్ సమీపంలోని ఓ క్రాస్ దగ్గర యువతిని బస్సు నుంచి కిందకు నెట్టి అక్కడి నుంచి పరారైనారు.

యువతి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి రవి, మంజులను అరెస్టు చేశారు. యువతికి వైద్య పరిక్షలు నిర్వహించామని కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Bengaluru police have arrested two persons in the connection with the rape case of 19 year old girl Sulibele, Bengaluru out skirts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X