డ్రెస్ ఛేంజ్ కోసమని వెళ్లి దర్శన్ ప్రియురాలు ఎంత పని చేసింది..!
కన్నడ స్థార్ హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ ఓ వ్యక్తిని హత్య చేయించారనే ఆరోపణలతో ఆయన్ను కన్నడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్శన్ ప్రస్తుతం పవిత్ర గౌడ అనే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెను రేణుక స్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుక స్వామి తనని వేధిస్తున్నాడనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్‌కు తెలియజేసింది. దీంతో రేణుక స్వామిని దర్శన్ హత్య చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. దర్శన్ చెబితేనే తాము ఈ హత్య చేసినట్టు నిందితులు చెప్పడంతోనే దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో పవిత్ర గౌడ సైతం అరెస్ట్ అయ్యారు. ప్రియురాలు పవిత్రగౌడతో పాటు 17 మందికి జ్యూడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ప్రస్తుతం వీరంతా బెంగళూరులోని పరప్పన జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే పవిత్ర గౌడ చేసిన పని ఇప్పుడు పోలీసుల్ని ఇరాకటంలోకి నెట్టింది. విచారణ భాగంగా రాజేశ్వరి నగర్‌లోని పవిత్ర ఇంటి దగ్గర సీన్ రీ క్రియేట్ జరిగింది.

తన ఇంటికెళ్లిన పవిత్ర మేకప్ వేసుకుని బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలి పట్ల ఇంత నిర్లాక్ష్యంగా ఉంటారా ? అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓ మహిళ పోలీసుకు నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నేత్రావతికి పశ్చిమ డివిజన్ డీసీపీ గిరీష్ నోటీసులు జారీ చేశారు. కాగా, దీనిపై ఆమె మేకప్ వేసుకునేందుకు తాము అనుమతించలేదని, డ్రెస్ ఛేంజ్ చేసుకునేందుకు వాష్ రూంకి వెళ్లిందని, అప్పుడే మేకప్ వేసుకుందని తెలిపినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications