చైత్రా మేడమ్ కు షాక్, ఇంకో ఎఫ్ఐఆర్, బోనస్ గా కేసుల మీద కేసులు, కథ కంచికేనా ?

బెంగళూరు: కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని బైందూరు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ టిక్కెట్టు వ్యాపారికి ఇస్తానని మోసం చేసి జైలుకు వెళ్లిన హిందూ సంఘ సంస్థ లేడీ లీడర్ చైత్ర కుందాపురపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఉడిపి జిల్లా కుందాపుర తాలూకాలోని కోటలో బట్టల దుకాణం తెరిపిస్తానని నమ్మించి ఐదు లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు చైత్రా కుందాపుర మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుదిన అనే బీజేపీ కార్యకర్త మోసపోయిన వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు అన్నారు. 2015లో సుదిన హిందూ సంఘం లేడీ లీడర్ చైత్ర కుందాపురను కలిశారు. వ్యాపారి సుదిన ఆ సందర్బంలో చైత్రా కుందాపుర చెప్పిన మాటలు నమ్మి చైత్రాకు డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.

Karnataka Police registered another FIR against Hindu community leader Chaitra Kundapura.

బీజేపీలో ఉన్నత స్థానాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చైత్రా కుందాపుర వ్యాపారి సుదినను నమ్మించిందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కోటలో బట్టల దుకాణం ప్రారంభిస్తామని నమ్మించి సుదిన నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారని సమాచారం.

2018-2023 మధ్య కాలంలో షాపు నిర్మాణానికి దశలవారీగా ఐదు లక్షలు వచ్చాయని, సుదిన మూడు లక్షలు చైత్రా కుందాపుర ఖాతాలోకి జమ చేసి రెండు లక్షల నగదు ఇచ్చిందని చెబుతున్నారు. బట్టల దుకాణం గురించి అడగ్గా అది చివరి దశలో ఉందని చైత్రా కుందాపుర అబద్ధం చెప్పిందన సుదిన ఆరోపించారు.

తరువాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి, ప్రసంగాలకు, కార్యవర్గ సమావేశాలకు, పార్టీ నేతలతో సమావేశాలకు వెళ్లాలని సాకుతో చైత్రా కుందాపుర తప్పించుకుని తిరిగిందని సుదిన ఆరోపించారు. దీంతో అనుమానం వచ్చిన సుదిన వెంటనే బట్టల దుకాణం తెరిపించాలని చైత్రా కుందాపురను డిమాండ్ చేసింది.

Karnataka Police registered another FIR against Hindu community leader Chaitra Kundapura.

ఈ సమయంలో చైత్రా కుందాపుర తన మీద అత్యాచారం కేసు పెట్టి జైలుకు పంపిస్తానని, కిరాయి గూండాలతో చంపేస్తానని బెదిరించిందని సుదిన ఆరోపించారు. వ్యాపారి గోవిందబాబు పూజారిని కోట్లాది రూపాయల మోసం చేసిన కేసులో జైలులో ఉన్న చైత్రా కుందాపురపై బ్రహ్మావర్ సర్కిల్ పరిధిలోని కోట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఇప్పటికే కోట్ల రూపాయల చీటింగ్ కేసులో అరెస్టు అయిన చైత్రా కుందాపుర మీద మరో కేసు నమోదు కావడంతో ఇప్పుడు ఆమె మీద కేసుల పెట్టే వారి సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి అంటున్నారు. అయితే ఇప్పటికే అరెస్టు అయిన చైత్రా కుందాపుర బెయిల్ మీద బయటకు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+