డీకే శివకుమార్‌కు అద్భుత రాజయోగం.. సంచలన జోస్యం!
దక్షిణాది రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామాలకు వేదికైన కర్ణాటకలో పీఠం మార్పిడి వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో సాగుతున్న సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన వైదొలగడంతో, కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి సర్వం సిద్ధమైంది. ఈ పరిణామాల మధ్య బెంగళూరులోని విధానసౌధలో శనివారం సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కీలక భేటీలో డీకే శివకుమార్‌ను శాసనసభాపక్ష నూతన నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తుండగా.. మరోవైపు ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకానాథ్ గురూజీ చెప్పిన జాతక విశేషాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. శనివారం (మే 30, 2026) ఆయన పీటీఐ వీడియోస్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. డీకే శివకుమార్‌కు అత్యంత సుదీర్ఘమైన, బలమైన రాజకీయ భవిష్యత్తు ఉందని కొనియాడారు.

సీఎం పీఠం ఎక్కి రాష్ట్ర బాధ్యతలు చేపట్టడానికి డీకేకు ఆయన మూడు అనుకూల ముహూర్తాలను (తేదీలను) కూడా సూచించారు. అవి మే 31 (ఆదివారం), జూన్ 5, జూన్ 6వ తేదీలు. "నేను ఆయనకు మూడు తేదీలు ఇచ్చాను. ఆయన ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు, లేదా ఒక్కసారి మాత్రమే సీఎంగా ఉండే వ్యక్తి కాదు. ఆయన జాతకం చాలా అద్భుతంగా ఉంది. ఆయన చాలా కాలం పాటు కర్ణాటక ప్రజలకు సేవ చేస్తారు" అని గురూజీ వివరించారు.
డీకే శివకుమార్ నాయకత్వంలో కర్ణాటక రాష్ట్రం "ఆరోగ్యవంతమైన, సంపన్నమైన" రాష్ట్రంగా మారుతుందని గురూజీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఆయన జాతక రీత్యా ఒక కీలక సూచన కూడా చేశారు. డీకే శివకుమార్ ముందుగా తనపై ఉన్న పరిపాలనా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని, ఆ తర్వాతే 2028 అసెంబ్లీ ఎన్నికలలో కొత్త ప్రజా తీర్పు కోరాలని తెలిపారు.
"నిస్సందేహంగా, ఆయన తదుపరి ఎన్నికల్లో గెలవాలి, అప్పుడే ఆయన నిజమైన ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ఆయన బాధ్యతలను పటిష్ఠంగా నిర్వర్తించి, తదుపరి పదవీకాలంలో ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి" అని గురూజీ డీకే శివకుమార్ జాతక చక్రం ఆధారంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మద్దతు కూడా శివకుమార్‌కు పూర్తిగా ఉంటుందని ఆయన అన్నారు.














Click it and Unblock the Notifications