బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ దెబ్బ: ఐటీ షాక్, చెవిలోపువ్వు పెట్టుకుని రాలేదు, రాజకీయం చెయ్యడానికి, చూపిస్తా: డీకే !

నాలుగు రోజుల నుంచి ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఎట్టకేలకు శనివారం మద్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నాలుగు రోజుల నుంచి ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ ఎట్టకేలకు శనివారం మద్యాహ్నం మీడియా ముందుకు వచ్చారు. బెంగళూరులోని సదాశివనగర్ లోని తన ఇంటి ముందు డీకే. శివకుమార్ మీడియాతో మాట్లాడారు.

ఐటీ దాడులు: మొత్తం డబ్బు అంతా మాది కాదు, మంత్రి తమ్ముడు రివర్స్ గేర్, మరెవరిది?ఐటీ దాడులు: మొత్తం డబ్బు అంతా మాది కాదు, మంత్రి తమ్ముడు రివర్స్ గేర్, మరెవరిది?

గత నాలుగు రోజుల నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు తన ఇంటిలో సోదాలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని వెళ్లారని చెప్పారు. బెంగళూరులోని ఇంటిలో, ఢిల్లీలోని తన నివాసంలో ఏమి చిక్కాయి అని ఐటీ శాఖ అధికారులు నివేదిక (పంచనామ) తయారు చేసిన తరువాత తాను మాట్లాడుతానని డీకే. శివకుమార్ చెప్పారు.

వారి పని వారు చేశారు

వారి పని వారు చేశారు

ఆదాయపన్ను శాఖ అధికారులు వారి పని వారు చేసుకుని వెళ్లారని మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. తన ఇంటిలో ఏమి చిక్కాయి అనే పూర్తి వివరాలు వారు తనకు చెప్పిన తరువాత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని డీకే. శివకుమార్ అన్నారు.

ఇప్పుడు మాట్లాడను

ఇప్పుడు మాట్లాడను

ఆదాయపన్ను శాఖ అధికారులు తనకు వివరణ ఇవ్వాలని పంచనామా ఇచ్చిన తరువాత మాట్లాడటం పద్దతి అని డీకే. శివకుమార్ చెప్పారు. నాకు సంబంధించిన ఆస్తులు, నగదు ఎంత స్వాధీనం చేసుకున్నారని అని నేనే ఎలా చెప్పాలి ? పంచనామా వచ్చిన తరువాతే మళ్లీ మీడియా ముందు మాట్లాడుతా అన్నారు.

అందరికీ ధన్యవాదాలు

అందరికీ ధన్యవాదాలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక నాయకులు, పార్టీ కార్యకర్తలు తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. వారు తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని, కష్టకాలంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని డీకే. శివకుమార్ చెప్పారు.

మీడియాకు థ్యాక్స్, వెంటనే వార్నింగ్

మీడియాకు థ్యాక్స్, వెంటనే వార్నింగ్

నాలుగు రోజుల నుంచి పగలు, రాత్రి అని తేడా లేకుండా మా ఇంటి దగ్గరే నా కోసం వేచి ఉన్న మీడియాకు ధన్యవాదాలు అని చెప్పిన డీకే. శివకుమార్ వాస్తవాలు తెలీకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు వార్తలు ప్రసారం చేశారని, కథనాలు ప్రచురించారని, ఇది మీకు పద్దతిగా ఉందా అని ప్రశ్నించిన ఆయన పరోక్షంగా మీడియాను హెచ్చరించారు.

చెవిలోపువ్వు పెట్టుకుని రాలేదు

చెవిలోపువ్వు పెట్టుకుని రాలేదు

నేను పల్లి (గ్రామం) నుంచి వచ్చాను, చెవిలోపువ్వు పెట్టుకుని రాలేదు, రాజకీయం చెయ్యడానికి నగరానికి వచ్చా, నా రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి పనులు చెయ్యలేదని, అలా చేసి ఉంటే ఇంత కాలం తాను రాజకీయాల్లో ఉండేవాడినికి కాదని డీకే. శివకుమార్ చెప్పారు.

English summary
Karnataka Power Minister DK Shivakumar refuses to give any informatiion regarding the raid on his house by Income Tax Department officials since four days. He was taking to press, for the first time after these raids. DK Shivakumar thanked media as saying that , media has guarded his residence since four days (from August 2nd) while IT investigation was going on at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X