ఛానళ్లలో మహిళ ఆరోపణ: మాజీమంత్రి సూసైడ్‌యత్నం

ఆయన సహాయకుడు తక్షణమే అతనిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ప్రస్తుతం ఐసియులో ఉన్నారు. చికిత్స అందిస్తున్నారు. రామదాసు వయస్సు 54. ఆయన పెళ్లి చేసుకోలేదు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.
తను పెళ్లి చేసుకుంటానని వంచించారని ఆరోపిస్తూ ప్రేమ కుమారి అనే మహిళ మంగళవారం సాయంత్రం ఆరోపణలు చేశారు. ఐదేళ్లుగా తనను మోసం చేశారని చెప్పారు. ఈ విషయాలు టివి ఛానళ్లలో రావడంతో మాజీ మంత్రి మనోవేధనకు గురై ఆత్మహత్యాయత్నం చేశారు.
ఆమె మీడియాతో మాట్లాడుతుండగా మాజీ మంత్రి ప్రేమ కుమారికి ఫోన్ చేసి ఈ ప్రచారం ఆపకుంటే తాను విషం తాగుతానని ఫోన్ ద్వారా హెచ్చరించారట.












Click it and Unblock the Notifications