కర్ణాటక సీఎం సిద్దరామయ్య కార్యాలయానికి తాళం, విదాన సౌధలో ఎఫెక్ట్, మీడియాలో వైరల్ !
బెంగళూరు: బెంగళూరులోని విదానసౌదలోని సీఎ: సిద్దరామయ్య కార్యాలయానికి తాళం వేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ వెళ్లడానికి సిద్దం అయిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్. యడ్యూరప్ప చివరి నిమిషంలో మనసుమార్చుకున్నారు.

సీఎం పదవి
కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవి లేకపోయానా పర్వాలేదు కాని కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

అతి కష్టం మీద సీఎం
మైసూరు జిల్లాలోని చాముండేశ్వని శాసన సభ నియోజక వర్గంలో ఘోరంగా ఓడిపోయిన సీఎం సిద్దరామయ్య బాగల్ కోటే జిల్లా బాదామిలో అతి కష్టం మీద విజయం సాధించారు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని చర్చలు జరుగుతున్నాయి.

సీద్దూ ఆఫీసుకు తాళం
కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య అయ్యే అవకాశం చాల తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్బంలో విదాన సౌధలో సీఎం సిద్దరామయ్య కార్యాలయానికి తాళం వేస్తున్న ఫోటో ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అయ్యింది.

సీద్దూను దూరం పెట్టండి
సీఎం సిద్దరామయ్య రాజకీయ జీవితం ముగిసిపోయిందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా సిద్దరామయ్యను అధికారానికి దూరంగా పెట్టే అవకాశాలు చాల ఎక్కవగా ఉన్నాయి. ఇలాంటి సందర్బంలో సీఎం సిద్దరామయ్య కార్యాయానికి తాళం వెయ్యడం చర్చకు దారితీసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications