కర్ణాటక స్పీకర్ రాజీనామా ? నమ్మకం లేకపోతే, 40 ఏళ్ల రాజకీయ జీవితం, మర్యాదగా !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ నేడు (సోమవారం) ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని వెలుగు చూసింది. 40 సంవత్సరాల తన రాజకీయ జీవితం ఓ దశకు చేరుకుందని స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ అంటున్నారు.

స్పీకర్ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలతో మానసికంగా తాను కలత చెందానని విచారం వ్యక్తం చేశారు. సోమవారం కర్ణాటక శాసన సభలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన మీకు ఎదురౌతుందని స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ చెప్పారు.

 Karnataka Speaker Rameshkumar may resign to his post today

సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బలపరీక్ష నిరూపించుకుంటున్న సమయంలో స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. యడియూరప్ప బలపరీక్ష నిరూపించుకున్న తరువాత స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం.

తాను సోమవారం శాసన సభలో ఏమి చెప్పాలనుకుంటున్నానో అదే విషయం కచ్చితంగా చెబుతానని స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వాళ్లకు తన మీద నమ్మకం లేకపోతే అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడానికి సిద్దం అయ్యే అవకాశం ఉందని స్పీకర్ రమేష్ కుమార్ చెప్పారు.

అయితే గౌరవంగా బతుకుతున్న తాను ఆ అవకాశం వారికి ఇవ్వడానికి సిద్దంగా లేదనని స్పీకర్ రమేష్ కుమార్ అన్నారు. యడియూరప్ప బలపరీక్ష నిరూపించుకున్న తరువాత స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ తాను రాజీనామా చేస్తానని పరోక్షంగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+