ముగ్గురు అక్కా చెల్లెళ్లు మీద నెల రోజులు ఐదు మంది సామూహిక అత్యాచారం, పక్కా ప్లాన్!

బెంగళూరు: ప్రేమించానని నమ్మించి యువతితో పాటు అక్కా చెల్లెళ్లను తీసుకెళ్లి స్నేహితులతో కలిసి నెల రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశాడు. చివరికి యువతులను బలవంతంగా వేశ్యవాటిక కేంద్రంలో విక్రయించడానికి ప్రయత్నించడంతో వారు తప్పించుకున్నారు. ఓ కామాంధుడిని కర్ణాటకలోని మైసూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.

మైసూరు నగరంలోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పేదరికంలో ఉన్న 16, 17, 18 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. మంగళూరుకు చెందిన అబాన్ (30) అనే యువకుడు మైసూరు చేరుకుని యువతులు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఉంటున్నాడు.

 Karnataka: Three sisters sexually abused for months by five men

అబాన్ యువతులను పరిచయం చేసుకున్నాడు. ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు నటించాడు. నెల రోజుల క్రితం యువతులను నమ్మించిన అబాన్ వారిని ఇంటి నుంచి పిలుచుకుని వెళ్లాడు. తరువాత బెంగళూరు, మంగళూరు, మండ్య ప్రాంతాల్లో అబాన్, అతని స్నేహితులు కలిసి యువతుల మీద సామూహిక అత్యాచారం చేశారు.

నెల రోజుల అయినా కుమార్తెలు కనపడకపోవడంతో యువతుల తల్లి ఎన్ జీఓ సభ్యుల సహాయంతో ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి యువతులను రక్షించి ఎన్ జీఓ సభ్యులకు అప్పగించారు. యువతులతో పోలీసులు అబాన్ కు ఫోన్ చేయించారు.

మంగళూరులో అబాన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అబాన్, అతని స్నేహితులు కలిసి తమను వేశ్యవాటిక కేంద్రంలో విక్రయించడానికి ప్రయత్నించారని, తాము తప్పించుకున్నామని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబాన్ స్నేహితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+