సీఎంకు మస్త్ మజా క్లారిటీ ఇచ్చిన పవర్ ఫుల్ లీడర్, ఏదో అనుకుంటే !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోని నాయకులు మంత్రి పదవులు ఆశించారు. గతంలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని మంత్రి పదవులు పంచుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎవ్వరితో పొత్తులు లేకుండానే సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

కొన్ని సంవత్సరాలుగా అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దర్జాగా ఐదు సంవత్సరాల పాటు కర్ణాటకను ఎలడానికి సిద్దం అయ్యింది. సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మార్క్ రాజకీయాలతో ఇప్పటికే మంత్రి పదువులు పంపిణి కూడా జరిగిపోయింది.

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తుంటారు. సంపూర్ణ మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులు చాలా మంది ఉన్నా అందరికి చెక్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ చిరికి కొంత మందికి మాత్రం అవకాశం ఇవ్వడంతో మిగిలిన ఎమ్మెల్యేలు నిరాశ చెందారు.

మంత్రి పదవి దక్కలేదని ఆవేదనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయయుడు బీకే. హరిప్రసాద్ మండిపడుతున్నారని తెలిసింది. సీఎం సిద్దరామయ్య కారణంగానే తనకు మంత్రి పదవి దక్కలేదని చాలా మందిదగ్గర బీకే. హరిప్రసాద్ అసహనం వ్యక్తం చేశారని కన్నడ మీడియాలో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.

అయితే ఈ విషయంలో బీకే. హరిప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తెలుసు అని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మా పార్టీకి చెందిన ప్రతిఒక్క నాయకుడు పని చేశారని బీకే. హరిప్రసాద్ అన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభం వచ్చిందని బీకే హరిప్రసాద్ అన్నారు.

 Karnataka Vidhan

కేపీసీసీ అధ్యక్షుడి కారణంగా ఒక్కలిగ ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీకి లాభం వచ్చిందని, డీకే శివకుమార్ కారణంగానే జేడీఎస్ కు మంచి దెబ్బ పడిందని బీకే. హరిప్రసాద్ అభిప్రాయం వ్యక్యం చేశారు. తనకు మంత్రి పదవి రాకపోవడానికి ఎవరు కారణం?, తనను సైడ్ లైన్ చెయ్యడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అని త్వరలోనే అన్ని వివరాలు బయటకు చెబుతానని బీకే. హరిప్రసాద్ అన్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని తాను ఎమ్మెల్సీ పదవికి, కర్ణాటక విధాన పరిషత్ ప్రతిపక్ష పదివికి రాజీనామా చేస్తానని కొందు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిది ఏమైనా ఉంటే తాను సమాచారం ఇస్తానని బీకే హరిప్రసాద్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+