టిక్‌టాక్‌కు మరొకరు బలి.. స్టంట్ చేస్తూ మెడ విరగ్గొట్టుకున్న యువకుడి మృతి..
తుమకూరు : సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌కు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అదే రేంజ్‌లో ప్రమాదాలకు కారణమవుతోంది. కాపురాల్లో చిచ్చు పెట్టడమేకాక.. ఆత్మహత్యలకు కారణమవుతున్న ఈ యాప్‌లో పాపులారిటీ కోసం యూత్ వేస్తున్న పిచ్చి వేషాలు ఎన్నో. అలాంటి అడ్వెంచర్ చేయబోయిన ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచాడు.
కర్నాటక తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి మండలం గెడెకెరెకు చెందిన కుమార్ ఆర్కెస్ట్రా గ్రూప్‌లో సింగర్, కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 17న ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బ్యాక్ జంప్ స్టంట్ చేశాడు. ఆ సమయంలో కుమార్ పట్టు తప్పడంతో శరీరం బరువంతా మెడపై పడి వెన్నెముక విరిగిపోయింది. దీంతో అతన్ని చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించారు.
Recommended Video


కుమార్‌ను పరీక్షించిన డాక్టర్లు వెన్నెముక దెబ్బతిందని, శరీరం మొత్తం పక్షవాతానికి గురైందని చెప్పారు. గత ఎనిమిది రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబాన్ని పోషిస్తున్న కొడుకు మృత్యువాతపడటంతో తమకు ఎంకెవరు దిక్కంటూ కుమార్ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications