కరుణానిధికి అస్వస్థత: చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గురువారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
న్యూట్రిషన్, హైడ్రేషన్ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. కొద్ది రోజులపాటు ఆయన ఆస్పత్రిలో ఉండే చికిత్స తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రిలో కరుణానిధి వెంట ఆయన కుమారుడు, డీఎంకే ట్రెజరర్ ఎంకె స్టాలిన్ ఉన్నారు.
కాగా, కొద్దిరోజుల క్రితం కూడా కరుణానిధి అస్వస్థతకు గురై కోలుకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications