రెండు రోజుల్లో కరుణానిధి ఇంటికి: స్టాలిన్, ఎందుకంటే ?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యం కుదటపడిందని, రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెలుతామని ఆయన కుమారుడు, డీఎంకే పార్టీ కోశాధికారి ఎం.కే. స్టాలిన్ అన్నారు. నాన్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యం కుదటపడిందని, రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెలుతామని ఆయన కుమారుడు, డీఎంకే పార్టీ కోశాధికారి ఎం.కే. స్టాలిన్ అన్నారు.
సోమవారం స్టాలిన్ కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుణానిధిని పరామర్శించారు. కావేరీ ఆసుపత్రిలో వైద్యులతో చర్చించారు. తరువాత స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. నాన్న ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు.

దేవుడి దయవలన కరుణానిధి కోలుకున్నారని, రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని డాక్టర్లు చెప్పారని స్టాలిన్ వివరించారు. కరుణానిధికి వాయు నాళంలో రంధ్రం పెట్టి శ్వాస అందిస్తూ (Tracheostomy)చికిత్స చేశామని, ప్రస్తుతం ఆయన స్వయంగా శ్వాస తీసుకుంటున్నారని కావేరీ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
గొంతు, ఊపిరితిత్తుల ఇన్పెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కరుణానిధిని డిసెంబర్ 15వ తేది గురువారం అర్దరాత్రి కావేరీ ఆసుప్రతికి తరలించారు. ఇదే నెలలో రెండు సార్లు కరుణానిధి ఆసుపత్రిలో చేరారు.
కరుణానిధి అనారోగ్యంతో భాదపడుతున్న సందర్బంగా ఈనెల 20వ తేది ఏర్పాటు చేసిన డీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం రద్దు చేశారు. త్వరలోనే పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే నాయకులు తెలిపారు.












Click it and Unblock the Notifications