వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేగా కరుణానిధికి 60 ఏళ్లు: భారతదేశ చరిత్రలోనే రికార్డు !

డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి వజ్రోత్సవ ఎమ్మెల్యేగా పేరు పొందారు. 1957 ఏప్రిల్ 1 నుంచి 2017 వరకు ఆయన వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరుణానిధి 18 ఏళ్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి వజ్రోత్సవ ఎమ్మెల్యేగా పేరు పొందారు. 1957 నుంచి 2017 వరకు ఆయన వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కరుణానిధి హిస్టరీలో ఓటమి అనే పదం కనపడదు. అంతటి పేరు తెచ్చుకున్న కరుణానిధి డీఎంకే పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకుడిగా ఉన్నారు.

1957 ఏప్రిల్ 1వ తేదీన కుళిత్తలై ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. నేటికి ఆయన వరుసగా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా 60 ఏళ్లు పూర్తి చేసుకుని రికార్డులు తిరగరాశారు. వజ్రోత్సవాలు జరుపుకున్న రాష్ట్ర శాసన సభలో కరుణానిధి కూడా ఎమ్మెల్యేగా ఉండటం విశేషమని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ అంటున్నారు.

Karunanidhi had won the Assembly elections 13 times

1924 జూన్ మూడవ తేదీన తిరుక్కువలై లో కరుణానిధి జన్మించారు. 14వ ఏటనే జస్టిస్ పార్టీకి ఆకర్షితులై రాజకీయ ప్రవేశం చేశారు. 1957లో కుళిత్తలై శాసన సభ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కరుణానిధి పోటీ చేసి మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు.

తరువాత ఆయన వరుసగా ఎమ్మెల్యే అవుతూ వస్తున్నారు. రెండు సార్లు ప్రజాపనుల శాఖ మంత్రిగా పని చేశారు. 18 ఏళ్లకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే కరుణానిధి ప్రత్యేక స్థానం పొందడం విశేషం.

English summary
M. Karunanidhi had won the Assembly elections 13 times and he is the only leader in the country who had never tasted defeat in Assembly election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X