చక్రాల కుర్చీలో కూర్చొనే.. మనవడితో క్రికెట్ ఆడిన కరుణానిధి.. వీడియో వైరల్!
చెన్నై: తమిళనాట డీఎంకే అధినేత, కురువృద్ధుడు కరుణానిధి ఏం చేసినా సంచలనమే. 93 ఏళ్ల వయసులోనూ ఆయన తాజాగా రెండేళ్ల వయసున్న తన మనవడితో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
క్రికెట్ ఆడేందుకు కరుణానిధి ఏ మైదానానికో వెళ్లలేదు. తన ఇంట్లోనే, చక్రాల కుర్చీలో కూర్చునే ఆయన ఆడారు. తన ముని మనవడు బ్యాటు పట్టుకుని ఆడుతుంటే, సరదాగా బౌలింగ్ చేశారు.
ఆ సమయంలో ఇంట్లోని ఆయన బంధువుల్లోని ఇద్దరు మహిళలు ఫీల్డింగ్ చేస్తూ, బాల్‌ను కరుణానిధికి అందించారు. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న వదంతులకు ఈ వీడియోతో చెక్ చెప్పినట్లయింది.
గతంలో అనారోగ్యం కారణంగా కరుణానిధి ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నా ఆయన ఆరోగ్యం గురించి అనేక వదంతులు వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియోను చూసిన డీఎంకే అభిమానులు తమ నేత బాగానే ఉన్నారనుకుంటూ ఊరట చెందుతున్నారు.












Click it and Unblock the Notifications