13: పార్టీ ఓడినా ఎవరికీ సాధ్యం కాని రికార్డు కరుణానిధి సొంతం
చెన్నై: జూన్ 3వ తేదీకి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధికి 93 ఏళ్లు రానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఆరోజు కరుణానిధి పార్టీని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుదామని డీఎంకే శ్రేణులు ఆశపడ్డాయి. అయితే గురువారం విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా 1984 నాటి చరిత్రను తిరగరాస్తూ వరుసగా రెండో సారి ఒకే పార్టీకి అధికారం కట్టెబెట్టారు తమిళ తంబీలు. కాగా ఈ ఎన్నికల్లో జయలలిత విజయం సాధంచి చరిత్ర సృష్టిస్తే, అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయిన కరుణానిధి, తాను పోటీ చేసిన తిరువారూర్ నియోజకవర్గంలో విజయం సాధించి మరో చరిత్ర సృష్టించారు.
ఈ విజయంతో వరుసగా 13వ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అన్నింటిలో విజయం సాధించిన ఏకైక భారతీయుడిగా కరుణానిధి చరిత్ర సృష్టించారు. భారత్‌లో ఇప్పటివరకు ఈ ఘనతను ఎవరూ సాధించలేదు. దీనిని బట్టి చూస్తే 60 ఏళ్ల నుంచి ఆయన తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నారు.

తాజా గెలుపుతో మరో ఐదేళ్ల అవకాశాన్ని ఈ ఎన్నికల ద్వారా ఆయన అందుకున్నారు. ఇప్పటివరకు పోటీ చేసిన అన్ని శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కరుణానిధి, అపజయమనేదే ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు. 2011లోను కరుణానిధి తిరువారూర్ నుంచే పోటీ చేసి 50,249 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కరుణానిధి 12 ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క దాంట్లోను ఓడిపోకుండా రికార్డు సృష్టించారు. తొలిసారి 1957లో కరుణానిధి ఎన్నికల బరిలో పోటీ చేశారు. అప్పుడు, తన 33 ఏళ్ల వయస్సులో కులితలై నుంచి కరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన పోటీ చేసిన 12 ఎన్నికల్లో గెలిచారు.
గతంలో కరుణానిధి పోటీ చేసిన నియోజగవర్గాలు:
* 1957లో కరుణానిధి కులిత్తలై నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఏ ధర్మలింగంను 8,296 ఓట్లతో ఓడించారు.
* 1962లో తంజావూరు నుంచి పోటీ చేశారు. 20,482 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్జీ వినాయకమూర్తిని ఓడించారు.
* 1971లో సైదాపేట నుంచి పోటీ చేశారు. 12,511 ఓట్లతో కాంగ్రెసక్ పార్టీ అభ్యర్థి కామలింగంను ఓడించారు.
* 1977లో అన్నానగర్ నుంచి పోటీ చేశారు. 16,438 ఓట్లతో అన్నాడీఎంకే అఏభ్యర్థి జీ కృష్ణమూర్తిని ఓడించారు.
* 1980లో అన్నానగర్ నుంచి మరోసారి పోటీ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి హెచ్‌వీ హాండేను 699 ఓట్ల తేడాతో ఓడించారు.
* 1984లో కరుణానిధి పోటీ చేయలేదు. 1989లో హార్బర్ నుంచి పోటీ చేశారు. ముస్లీం లీగ్ అభ్యర్థి కేఏ వాహబ్ పైన 31,991 ఓట్లతో గెలుపొందారు.
* 1991లో హార్బర్ నుంచి పోటీ చేశారు. 890 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కే సప్పును ఓడించారు.
* 1996లో చెపాక్ నుంచి పోటీ చేశారు. 35,784 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎస్సెస్ నెల్లై కన్నన్‌ను ఓడించారు.
* 2001లో చెపాక్ నుంచి మరోసారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ దామోదరన్‌ను 4,834 ఓట్ల తేడాతో ఓడించారు.
* 2006లో చెపాక్ నుంచి పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థి డీ మిఖాన్‌ను 8,526 ఓట్ల తేడాతో ఓడించారు.
* 2011లో తిరువూర్ నుంచి పోటీ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఎం రాజేంద్రన్‌ను 50,249 ఓట్ల తేడాతో ఓడించారు.












Click it and Unblock the Notifications