చిక్కుల్లో పడ్డ విజయ్: కేసు నమోదు- జ్యూడీషియల్ ఎంక్వైరీకి సీఎం స్టాలిన్ ఆదేశం
ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో సంభవించిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 39కి చేరింది. ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఈ వేకువ జామున ఆయన కరూర్ ఆసుపత్రికి సందర్శించారు. బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు.
తొక్కిసలాట సమాచారం అందిన వెంటనే ఆయన చెన్నై నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుచ్చికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కరూర్ కు వచ్చారు. అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాల- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మృతులకు నివాళి అర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించారు. ఆ సమయంలో ఆయన వెంట మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఇతర అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు.. మరెన్నో ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించాయని, ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోలేదని అన్నారు. ఈ ఘటనను తనను కలచివేసిందని, కరూర్ తొక్కిసలాట ఉదంతాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 7:45 నిమిషాలకు చెన్నైలో అధికారులతో సమీక్షలో ఉన్నప్పుడు ఈ సంఘటన గురించి తెలిసిందని స్టాలిన్ వివరించారు.
సమాచారం అందిన వెంటనే సెంథిల్ బాలాజీకి ఫోన్ చేశానని, ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. తొక్కిసలాట ఘటన ఎలా చోటు చేసుకుందనే విషయంపై సమగ్ర దర్యాప్తును నిర్వహించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఆదేశించారు.
இரவு முழுவதும் உயிரிழந்தவர்களின் குடும்பத்தினர் சிந்திய கண்ணீரும், அவர்களது துக்கம் நிறைந்த அழுகுரல் ஏற்படுத்திய வலியும் என் நெஞ்சத்திலிருந்து அகலவில்லை… #KarurTragedy pic.twitter.com/Z9K2TZs7NW
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 28, 2025
విజయ్ ఆలస్యంగా రావడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందనడంపై వ్యాఖ్యానించడానికి స్టాలిన్ నిరాకరించారు. రాజకీయ వ్యాఖ్యలు చేయదలచుకోలేదని తేల్చి చెప్పారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. విచారణ కమిషన్ ద్వారా వాస్తవం బయటపడుతుందని, రాజకీయ కారణాలతో ఎవరి మీదా విమర్శలు చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నానని చెప్పారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications