హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. 29 మంది మృతి..50 మందికి సీరియస్..
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. విజయ్ ఫ్యాన్స్ వేలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. 22 మందిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Very scary..
— Karnan 𝕏 🖤 (@instinctper07) September 27, 2025
Hope others recover #TVK #TVKCampaign #Karur
pic.twitter.com/jUKP7cKrEU
టీవీకే అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి జరిగింది. ర్యాలీకి వేలాదిమంది ఫ్యాన్స్ తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో 10 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. మరో 50 మందికి సీరియస్ గా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనం గుమికూడిన నేపథ్యంలో ఊపిరాడక స్పృహ తప్పి పడిపోతున్నట్లు సమాచారం. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు తెలుస్తోంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్.. తన ప్రసంగం ఆపి.. సభకు వచ్చిన వారికి నీళ్లు, ఆహారం పంపిణీపై దృష్టి పెట్టారు. ఇప్పటికే సభ వద్దకు భారీగా అంబులెన్సులు చేరాయి. ఈ ర్యాలీలో ఓ 9 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ అయినట్లు సమాచారం. ఈ ర్యాలీలో డీఎంకే నేతలపై విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్ లో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని డీఎంకే నేతలు చెప్పి మాట తప్పినట్లు గుర్తుచేశారు విజయ్. వచ్చే 6 నెలల్లో తమిళనాడులో కొత్త ప్రభుత్వం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో విజయ్ ర్యాలీ నిర్వహించారు.
టీవీకే అధినేత విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించిన విషయం తెలిసిందే అయితే.. విజయ్ రావాల్సిన సమయం కంటే 5-6 గంటలు ఆలస్యంగా వచ్చారని, ఎటువంటి నియంత్రణ లేకుండా ఒక చిన్న స్థలంలో వేలాది మంది గుమిగూడటమే తొక్కిసలాటకు దారి తీసిందని తమిళ మీడియా పేర్కొంది. సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని పలువురు అంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications