Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెహ్రూ తప్పిదమే కాశ్మీర్‌కు శాపంగా మారిందా..చరిత్ర ఏం చెబుతోంది..?

కాశ్మీర్.. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాల్లో కచ్చితంగా ఈ ప్రాంతానికి స్థానం ఉంటుంది. ఈ ప్రాంతం చూసేందుకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడి ప్రజలు కూడా అంతే భయంతో కాలాన్ని వెల్లదీస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం కోరలు చాచి ఉంది. ఎటు నుంచి ఎవరు వచ్చి తుపాకులు గురి పెడతారో తెలియని పరిస్థితి. ఎక్కడి నుంచి తూటా గుండెల్లోకి దూసుకెళుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఉగ్రవాదం ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాల కాలం నుంచే కొనసాగుతోంది. ఇది ఎక్కువగా పాక్ ఆక్రమిత భారత్‌ పీఓకేలో కనిపిస్తుంది. అక్కడి నుంచే ఉగ్రవాదులు భారత్‌ భూభాగంలోకి అడుగుపెట్టి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ వచ్చిన తర్వాత ఉగ్రదాడులు ఒక్కింత తగ్గాయనే చెప్పాలి. అసలు ఈ ఉగ్రవాదం ఎప్పుడు ప్రారంభమైంది.. ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్‌లోనే ఎందుకు పేట్రేగిపోతోంది..?

పచ్చటి మైదానంలో రక్తపాతం
2025 ఏప్రిల్ 22.. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయం. పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం. ఎటు చూసిన పచ్చదనం. పర్యాటకులతో కిటకిటలాడుతోంది. సూర్యుడు ఆ పచ్చదనాన్ని చెట్ల మధ్యలో నుంచి మెలమెల్లగా ముద్దాడుతున్నట్లుగా ఉంది.గుర్రాలపై సరదా ట్రిప్స్ వేస్తూ చిన్నారుల ఆటపాటలు,పెద్దవారు ముచ్చట్లతో మునిగి తేలిపోయారు,అక్కడ పారుతున్న సెలయేర్లలో పిల్లలు రాళ్లు విసురుతూ అల్లరి చేస్తూ ఆనందంగా గడుపుతున్న ఆ సమయంలో ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. తుపాకుల శబ్ధాలు వినిపించాయి. ఏమైందో తెలుసుకునేలోపే తమ వారిలో తూటాలు దిగాయి. అప్పటి వరకు పచ్చదనంతో కళకళలాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. కట్ చేస్తే ముస్లిమేతరులే టార్గెట్‌గా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు.పర్యాటక ప్రాంతంలో భద్రతాదళాలు ఏమయ్యాయి.. ఉగ్రవాదులు అంత ఈజీగా అక్కడికి తుపాకులతో ఎలా చేరుకోగలిగారు.. అనేది చాలామందిని తొలుస్తున్న ప్రశ్న. ఇక పహల్గాంలాంటి ఘటనలు కొన్ని దశాబ్దాల నుంచే జరుగుతున్నాయి. దీనంతటికి కారణం ఎవరు..?

kashmir-conflict-origins-te-orism-key-events-from-1947-partition-to-abrogation-of-article-370

1947లో ఏం జరిగిందో తెలుసుకోవాలి
ఇక ఈ ఉగ్రవాద ఘటనలు గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా 1947 నుంచి ప్రారంభించాలి. భారత దేశానికి బ్రిటీషు వారు స్వాతంత్ర్యం ప్రకటించాక, ఇంకా మూడు రాజరికపు రాష్ట్రాలు లేదా ప్రాంతాలు భారత్‌లో విలీనం కాలేదు. ఆ ప్రాంతాలకు మరో పాలనా వ్యవస్థ ఉండేది. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండవది గుజరాత్‌లోని జునాగఢ్ మూడవది హైదరాబాద్ రాష్ట్రం. దేశ విభజన తర్వాత తాము ఏ దేశంలో విలీనం అయ్యేది లేదని తాము స్వతంత్ర్య దేశాలుగానే మిగిలిపోతామని ప్రకటించాయి. ఇందుకు అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ మాత్రం ఒప్పుకోలేదు. ఏది ఏమైనప్పటికీ భారత్‌లో విలీనం చేయాల్సిందే అని కరాకండిగా చెప్పేశారు.

శ్రీనగర్‌ పై పాక్ మద్దతు గిరిజన దళాలు దాడి
నాడు జమ్మూ కాశ్మీర్‌కు మహారాజగా ఉన్న రాజా హరిసింగ్‌ పాకిస్తాన్ నుంచి ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. 1947 అక్టోబర్ 22వ తేదీన పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన అక్కడి గిరిజన దళాలు కాశ్మీర్ పై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో మహారాజా హరిసింగ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు.అతని వద్ద సైనిక బలం లేదు. అప్పటికే పాక్ కొంత వరకు భూభాగం తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో భారత్‌ సహాయాన్ని అర్థించారు. భారత్ సహాయం చేసింది అనంతరం రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ఒప్పుకుంటూ 1947 అక్టోబర్ 26వ తేదీన డాక్యుమెంట్లపై సంతకం చేశారు. అలా జమ్మూ కాశ్మీర్ భారత్‌లో విలీనమైంది. పేరుకు కాశ్మీర్ భారత్‌లో విలీనమైంది కానీ.. ఆ ప్రాంతం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సమస్యాత్మక ప్రాంతంగానే చరిత్రలో నిలిచిపోయింది.

kashmir-conflict-origins-te-orism-key-events-from-1947-partition-to-abrogation-of-article-370

నెహ్రూ తప్పు చేశారా..?
నాడు దేశ విభజన సమయంలో ఎవరు ఏ దేశం వైపు వెళ్తారో నిర్ణయించుకునేందుకు స్వేచ్ఛ కల్పించారు. అయితే ఇది ప్రజలు నిర్ణయించలేదు. నాటి పాలకులు డిసైడ్ అయ్యారు. పాకిస్తాన్‌కు వెళ్లాలనుకునేవాళ్లు పాకిస్తాన్‌కు ఓటు వేశారు.. భారత్‌లో ఉండాలనుకునేవాళ్లు భారత్‌లో ఉండిపోయారు. ఇక్కడే అప్పటి దేశ తొలి ప్రధాని నెహ్రూ తప్పు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత భారత్ పీఓకేను వదులుకున్నారు. అలానే చైనాకు కొంత భాగం అప్పగించారు. 1972లో జరిగిన యుద్ధం సమయంలో పీఓకేను తిరిగి మనం పొందేందుకు మంచి అవకాశం లభించింది. నాడు 90వేల మంది యుద్ధ ఖైదీలుగా భారత్‌కు చిక్కారు. అప్పుటి ప్రధాని ఇందిరాగాంధీ పీఓకేను తమకు అప్పగించి ఈ యుద్ధ ఖైదీలను తీసుకెళ్లమని బేరం పెట్టింటే ఈ రోజు కాశ్మీర్‌లో ఉగ్రదాడులు జరిగేవి కావని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.

ఆర్టికల్ 370 రద్దుతో లోయలో అభివృద్ధి
ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఇప్పటి ఫరూఖ్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాతో కలిసి ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు. దాంతో పాటుగా అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ను కలిసి 35ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ఆరునెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని పార్లమెంటులో పాస్ చేయించాలి. కానీ నెహ్రూ ఇది పాస్ కానివ్వలేదని అందుకే ఆర్టికల్ 370 అప్పటి నుంచి మొన్నటి వరకు అమల్లో ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో బీజేపీ అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అంతకు ముందు లాప్స్ అయిన 35ఏ ఆర్డినెన్స్‌తోనే బండి లాక్కొచ్చారనేది వారి వాదన. 35 ఏ ప్రకారం జమ్మూ కశ్మీర్‌లో బయటి వ్యక్తి భూమి కొనుగోలు చేయరాదు.నెహ్రూ-షేక్ అబ్దుల్లాలు కలిసి ఈ కుట్రకు తెరలేపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకెళ్తామని నెహ్రూ ప్రకటించగానే.. ఆయన తప్పు చేస్తున్నట్లుగా గ్రహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారు కూడా. ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలు ఇబ్బందిపడతాయని చెప్పారు. దాని పర్యవసానమే ప్రస్తుత కాశ్మీర్‌లో నాటి నుంచి నేటి వరకు తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుచేశారు.

మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 2019లో రెండవ సారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కాశ్మీర్ లోయలో ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో పహల్గాం స్థాయిలో ఉగ్రదాడులు జరగలేదు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత తిరిగి అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది.దీంతో మళ్లీ అక్కడ ఉగ్రదాడులు జరిగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+